శ్రీమంతుడా యేసయ్యా

Sreemanthudaa Yesayya – శ్రీమంతుడా యేసయ్యా

శ్రీమంతుడా యేసయ్యా
నా ఆత్మకు అభిషేకమా
నా అభినయ సంగీతమా  ||2||

1.సిలువధారి నా బలిపీఠమా
నీ రక్తపు కోట నాకు నివాసమా    ||2||
నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా    
ఇదియే నీ త్యాగ సంకేతమా    ||2||    || శ్రీమంతుడా ||

2.మహిమగల పరిచర్య పొందినందున
అధైర్యపడను కృప పొందినందున      ||2||
మహిమతో నీవు దిగి వచ్చువేళ
మార్పునొందెద నీ పోలికగా    ||2||  || శ్రీమంతుడా ||

3.సీయోను శిఖరము సింహాసనము
వరపుత్రులకే వారసత్వము    ||2||
వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా    ||2||  || శ్రీమంతుడా ||

నా యెదుట నీవు – తెరచిన తలుపులు

Na yedhuta neevu therichina| నా యెదుట నీవు తెరచిన

నా యెదుట నీవు - తెరచిన తలుపులు 
వేయ లేరుగా - ఎవ్వరు వేయలేరుగా 
నీవు తెరచిన తలుపులు 

రాజుల రాజా -  ప్రభువుల ప్రభువా 
నీకు సాటి - ఎవ్వరు లేరయా 
నీ సింహాసనం - నా హృదయాన 
నీ కృపతోనే - స్థాపించు రాజా              || నా ఎదుట || 

కరుణామయుడా - కృపాసనముగా 
కరుణా పీఠాన్ని - నీవు మార్చావు 
కృప పొందునట్లు - నాకు ధైర్యమిచ్చి 
నీ సన్నిధికి - నన్ను చేర్చితివా               || నా ఎదుట || 

ప్రధాన యాజకుడా - నా యేసురాజా 
నిత్య యాజకత్వము - చేయుచున్నవాడా 
యాజక రాజ్యమైన - నిత్య సీయోను 
నూతన యెరూషలెం - కట్టుచున్నవాడా || నా ఎదుట ||