జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే

పల్లవి: జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే-

నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే-

నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే-    (2X)…జ్యోతిర్మయుడా…

 

1.నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా    (2X)

నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా    (2X)

జ్యోతిర్మయుడా…

 

2.నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి    (2X)

నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా    (2X)

జ్యోతిర్మయుడా…

 

3.నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా    (2X)

త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద    (2X)

జ్యోతిర్మయుడా…

సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి

Suryuni Dharinchi | సూర్యుని ధరించి

సూర్యుని ధరించి 
చంద్రుని మీద నిలిచి 
ఆకాశములో కనుపించె ఈమె ఎవరు ? 

ఆత్మల భారం - ఆత్మాభిషేకం 
ఆత్మ వరములు - కలిగియున్న 
మహిమ గలిగిన - సంఘమే                         || సూర్యుని||

జయ జీవితము - ప్రసవించుటకై 
వేదన పడుచు - సాక్షియైయున్న 
కృపలో నిలిచిన - సంఘమే                         || సూర్యుని ||

ఆది అపోస్తలుల - ఉపదేశమునే 
మకుటముగా - ధరించియున్న 
క్రొత్త నిబంధన - సంఘమే                            || సూర్యుని ||