నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే స్వంతమెగా } 2 నా ప్రియుడు నా వాడు } 2 ||నా ప్రియుడు|| మరణపు ముల్లును నాలో విరిచి మారాను మధురం గా చేసి } 2 మనస్సును మందిరము గా మార్చే } 2 ౹౹నా ప్రియుడు ౹౹ కృపనే ధ్వజముగా నాపై నెత్తి కృంగిన మదిని నింగి కెత్తి } 2 కృపతో పరవశ మొందించే } 2 ౹౹నా ప్రియుడు ౹౹ సంఘముగా నను చేర్చుకొని సంపూర్ణ నియమములన్నియును } 2 సంగీతముగా వినిపించే } 2 ౹౹నా ప్రియుడు ౹౹ జీవితమే జలరేఖలుగా చెదిరిన సమయములన్నింటిలో } 2 పిలుపును స్థిరపరచే కృపలో } 2 ౹౹నా ప్రియుడు౹౹ సంబరమే యేసు కౌగిలిలో సర్వాంగ సుందరుడై వచ్చువేళ } 2 సమీపమాయే ఆ శుభవేళ } 2 ౹౹ నా ప్రియుడు ౹౹
Telugu Christian Songs
Listen to the best Telugu Christian Songs including worship, gospel, and devotional music. Explore dedication songs, prayer songs, and inspirational Telugu lyrics.
కృపయే నేటి వరకు
Krupaye Neti Varaku – కృపయే నేటి వరకు
కృపయే నేటి వరకు కాచెను
నా కృప నిన్ను విడువ దనినా ౹౹కృప౹౹
1. మనోనేత్రములు వెలిగించినందున
యేసు పిలిచిన పిలుపును
క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో
పరిశుద్ధులలో చూపితివే ౹౹కృపా ౹౹
2. జలములలో బడి వెళ్ళునపుడు
అలలవలె అవి పొంగి రాగా
అలల వలే నీ కృపతోడై
చేర్చెను నన్ను ఈ దరికి ౹౹కృపా ౹౹
3. భీకర రూపము దాల్చిన లోకము
మ్రింగుటకు నన్ను సమీపించగా
ఆశ్చర్యకరములు ఆదుకొని
అందని కృపలో దాచెనుగా ౹౹కృపా౹౹
4. సేవార్థమైన వీణెలతో నేను
వీణెలు వాయించు వైణికులున్నా
సీయోను కొరకే జీవించుచూ
సీయోను రాజుతో హర్షించేదను ౹౹కృపా౹౹
5. నీదు వాక్యము – నా పాదములకు
నిత్యమైన వెలుగై యుండున్
నా కాలుజారె ననుకొనగా
నిలిపెను నన్ను నీ కృపయే ౹౹కృపా౹౹