ఏమని వర్ణింతు – నీ కృపను

ఏమని వర్ణింతు – నీ కృపను – ఏరులై పారెనె – నా గుండెలోన -2

ఏమని వర్ణింతు – నీ కృపను……

1. సర్వోన్నతుడా నీ సన్నిధిలో – బలము పొందిన వారెవ్వరైనా -2

అలసిపోలేదెన్నడును…. 2 ॥ ఏమని॥

2. పక్షిరాజు వలెను – నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2

నీ కృప నాపై చూపుటకా ….. 2 ॥ ఏమని॥

3. మరణము నశింపచేయుటకేనా – కృపాసత్య సంపూర్ణుడావై -2

మా మధ్యన నివసించితివా ….. 2 ॥ ఏమని॥

మాధుర్యమే నా ప్రభుతో జీవితం

మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మహిమానందమే – మహా ఆశ్చర్యమే       ||మాధుర్యమే||

సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు
వారి అందమంతయు పువ్వు వలె
వాడిపోవును – వాడిపోవును       ||మాధుర్యమే||

నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే
దేవుని యందలి భయ భక్తులతో
ఉండుటే మేలు – ఉండుటే మేలు       ||మాధుర్యమే||

నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే
నా రోగమంతయు సిలువలో
పరిహరించెను – పరిహరించెను       ||మాధుర్యమే||

వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను
తేజోవాసులైన పరిశుద్ధులతో
ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో       ||మాధుర్యమే||