ప్రభువా నీలో జీవించుట

పల్లవి:
ప్రభువా నీలో జీవించుట
కృపా బాహుల్యమే
నా యెడ కృపా బాహుల్యమే ||ప్రభువా||

1. సంగీతములాయె
పెను తుఫానులన్నియు (2)
సమసిపోవునే నీ నామ స్మరణలో (2)
సంతసమొందె నా మది యెంతో (2) ||ప్రభువా||

2. పాప నియమమును
బహు దూరముగా చేసి (2)
పావన ఆత్మతో పరిపూర్ణమైన (2)
పాద పద్మము హత్తుకొనెదను (2) ||ప్రభువా||

3. నీలో దాగినది
కృప సర్వోన్నతముగా (2)
నీలో నిలిచి కృపలనుభవించి (2)
నీతోనే యుగయుగములు నిల్చెద (2) ||ప్రభువా||

4. నూతన వధువునై
శుద్ధ వస్త్రములు ధరించి (2)
నూతనమైన శుభాకాంక్షలతో (2)
నూతన షాలేమై సిద్దమౌదు నీకై (2) ||ప్రభువా||

వందనము నీకే నా వందనము

వందనము నీకే నా వందనము (2)
వర్ణనకందని నీకే నా వందనము (2)      ||వందనము||

నీ ప్రేమ నేనేల మరతు
నీ ప్రేమ వర్ణింతునా (2)
దాని లోతు ఎత్తునే గ్రహించి (2)
నీ ప్రాణ త్యాగమునే తలంచి (2)      ||వందనము||

సర్వ కృపానిధి నీవే
సర్వాధిపతియును నీవే (2)
సంఘానికి శిరస్సు నీవే (2)
నా సంగీత సాహిత్యము నీవే (2)      ||వందనము||

పరిశుద్ధమైన నీ నామం
పరిమళ తైలము వలె (2)
పరము నుండి పోయబడి (2)
పరవశించి నేను పాడెదను (2)      ||వందనము||

మృతి వచ్చెనే ఒకని నుండి
కృప వచ్చెనే నీలో నుండి (2)
కృషి లేక నీ కృప రక్షించెను (2)
కృతజ్ఞతార్పణలర్పింతును (2)      ||వందనము||

తండ్రియైన దేవునికే
కుమారుడైన దేవునికే (2)
పరిశుద్ధాత్మ దేవునికే (2)
వందన వందన వందనము (2)      ||వందనము||