సర్వోన్నతుడా – హోసన్నా మినిస్ట్రీస్

సర్వోన్నతుడా
నీవే నాకు ఆశ్రయదుర్గము (2)
ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2)
ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2)

నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట
నిలువలేరని యెహోషువాతో (2)
వాగ్దానము చేసినావు
వాగ్దాన భూమిలో చేర్చినావు (2)      ॥సర్వోన్నతుడా॥

నిందలపాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు (2)
సింహాసనమిచ్చినావు
సింహాల నోళ్లను మూసినావు (2)      ॥సర్వోన్నతుడా॥

నీతి కిరీటం దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)
విశ్వాసము కాచినావు
జయజీవితము ఇచ్చినావు (2)      ॥సర్వోన్నతుడా॥

నా జీవం నీ కృపలో దాచితివే – హోసన్నా మినిస్ట్రీస్

నా జీవం నీ కృపలో దాచితివే
నా జీవిత కాలమంతా
ప్రభువా నీవే నా ఆశ్రయం
నా ఆశ్రయం         ||నా జీవం||

పాపపు ఊబిలో పడి కృంగిన నాకు
నిత్య జీవమిచ్చితివే (2)
పావురము వలె నీ సన్నిధిలో
జీవింప పిలచితివే (2)       ||నా జీవం||

ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము
అడ్డురానే వచ్చెనే (2)
నీ బాహు బలమే నన్ను దాటించి
శత్రువునే కూల్చెనే (2)       ||నా జీవం||

కానాను యాత్రలో యొర్దాను అలలచే
కలత చెందితినే (2)
కాపరివైన నీవు దహించు అగ్నిగా
నా ముందు నడచితివే (2)       ||నా జీవం||

వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము
నన్ను వెంటాడెనే (2)
వాక్యమైయున్న నీ సహవాసము
ధైర్యము పుట్టించెనే (2)       ||నా జీవం||

స్తుతుల మధ్యలో నివసించువాడా
స్తుతికి పాత్రుడా (2)
స్తుతి యాగముగా నీ సేవలో
ప్రాణార్పణ చేతునే (2)       ||నా జీవం||