నేను వెళ్ళే మార్గము

Nenu Velle Margamu ( నేను వెళ్ళే మార్గము) Song Lyrics

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును -2

శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను -2

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును

  1. కడలేని కడలి తీరము – యెడమాయె కడకు నా బ్రతుకున -2

గురిలేని తరుణాన వేరువగా – నా దరినే నిలిచేవా నా ప్రభూ -2

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును

  1. జలములలో బడి నేను వెళ్ళినా – అవి నా మీద పారవు -2

అగ్నిలో నేను నడచినను – జ్వాలలు నను కాల్చజాలవు -2

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును

  1. విశ్వాస నావ సాగుచూ – పయనించు సమయాన నా ప్రభూ -2

సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవ నా ప్రభు -2

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును -2

శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను -2

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప 

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప        ||శాశ్వతమైనది||

నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2)       ||శాశ్వత||

తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2)       ||శాశ్వత||

పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2)       ||శాశ్వత||