Isaiah – 48:1
Raja on ka Raja Prubhu on ke Prabhu
Pallavi : Devaadi devaa prabhuvula prabhoo
raajula raajaa – Halleluya
1. Nee rakhtamutho vimochinchi
nee rakhtamutho sampaadinchi
paraloka raajya prajalatho jerchi
paraloka paatan naakosagitivi “Devaadi”
2. Jeevitha naavalo thuphaanu rega
bhayapadakudani abhayamu nitchi
jayapradamugaa nannu nadipinchi
jaya jeevitamu naa kosagu chunna “Devaadi”
3. Peru petti nan prematho pilachi
karunatho nee soththu gaa nannu jesi
aramara leka nannaadarinchi
paraloka darshanambitchitivi “Devaadi”
4. Marana paatrulam iddarini Iona
duritha runamula smarananu maanpi
erparachu kontivi nerputho mammu
nee raajya mandu raajulan jesi “Devaadi”
5. Shodhanagaadhala kastamulalo
naa dukhamulalo ne nedvakundaa
nee daya naapai nindaara nimpi
odaarchi nannu nee daari nadupu . “Devaadi”
6. Prati vatsaramu daya thoda nimpun
prabhu jaadalu saaramu jallun
prati beedunoo saaramu chilakan
prati parvatamu aanandinchun “Devaadi”
7. Paraloka parishudda sangamubu yeduta
sarva shakhti gala kristuni yeduta
paraloka nootana geetamu paada
jerchitivi nan nee janamu nandu “Devaadi”
“ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడి.” మత్తయి Matthew 14:27
పల్లవి : దేవాది దేవా ప్రభువుల ప్రభూ
రాజుల రాజా హల్లెలూయ
1. నీ రక్తముతో విమోచించి – నీ రక్తముతో సంపాదించి
పరలోక రాజ్య ప్రజలతో జేర్చి – పరలోక పాటన్ నా కొసగితివి
|| దేవాది దేవా ||
2. జీవిత నావలో తుఫాను రేగ – భయపడకుడని అభయము నిచ్చి
జయప్రదముగా నన్ను నడిపించి – జయజీవితము నా కొసగుచున్న
|| దేవాది దేవా ||
3. పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి – కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి
అరమర లేక నన్నాదరించి – పరలోక దర్శనంబిచ్చితివి
|| దేవాది దేవా ||
4. మరణ పాత్రులం యిద్ధరణిలోన – దురిత ఋణముల స్మరణను మాన్పి
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము – నీ రాజ్యమందు రాజులన్ జేసి
|| దేవాది దేవా ||
5. శోధనగాధల కష్టములలో – నా దుఃఖములలో నే నేడ్వకుండా
నీ దయ నాపై నిండార నింపి – ఓదార్చి నన్ను నీ దారినడుపు
|| దేవాది దేవా ||
6. ప్రతి వత్సరము దయతోడ నింపున్ – ప్రభు జాడలు సారము జల్లున్
ప్రతి బీడునూ సారము చిలకన్ – ప్రతి పర్వతము ఆనందించున్
|| దేవాది దేవా ||
7. పరలోక పరశుద్ధ సంఘంబు యెదుట – సర్వశక్తిగల క్రీస్తుని యెదుట
పరలోక నూతన గీతము పాడ – జేర్చితివి నన్ నీ జనమునందు
|| దేవాది దేవా ||