హోసన్నా సంగీత సేవ 1 దిన 6: 32
క్రీస్తునందు ప్రియులకు నా హృదయ పూర్వకమైన వందనాలు. నా హృదయ స్పందనల మధ్య ధ్వనించిన రాగాలాపనలు కృపావాక్యముతో పెనవేసుకొని “సంగీత సేవ”గా మీ మధ్య ఇలా ప్రత్యక్షమైయింది. కొన్ని పాటలు కన్నీటి లోయల్లో, మరికొన్ని కృతజ్ఞతా శిఖరాలలో పుట్టాయి. కృపను గూర్చి పదే పదే పాడు కోవడమే నా అతిశయంగా మారింది. గత కాలంలో మరుగునపడిన కొన్ని పాటలను నేనేగాక నాతో పరిచర్యలో పాలిభాగస్తులైన వారు రచించిన పాటలుసంఘమునకు క్షేమము కలుగజేయగా వాటిని కూడా ఇందు పొందుపర్పు చున్నాను. యేసయ్య పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహాలు స్తుతి కీర్తనలు పాడారు (లూకా 2:14).యేసయ్య సిలువకు వెళ్ళే రోజుల్లో శిష్యులతో కలిసి కీర్తనలు పాడుచూ ఒలీవ కొండకు వెళ్ళారు (మార్కు 14:26). పౌలు సీలలు పాటలు పాడినపుడు జైలు పునాదులుకదిలాయి.సంకెళ్ళు తెంచబడ్డాయి (అ.కా 16:25). అసలుక్రైస్తవ్యంలో వున్న ప్రత్యేకత ఏమిటంటే, పిల్లలు పుట్టినా పాటలు పాడుతారు, మనుషులు చనిపోయినా పాటలు పాడుతారు. నిరీక్షణ లేని ఇతరుల వలె ఏడ్చి ప్రలాపించరు.మన పితామహులెందరో అనేక కీర్తనలు వ్రాసారు. ఆ పాటలుఈనాడు పాడుకున్నాభక్తి రసాలు ప్రవహిస్తూనే ఉన్నాయి. పాటలు పాడుతూ ఆరాధిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని హృదయాలలోకి దిగి రావాలి. ఆత్మతోను సత్యముతోను ఆరాధించే ఆరాధన ప్రతి సంఘములోను ప్రారంభం కావాలి. ఈ పాటలు మీ ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడాలని నా ఆకాంక్ష.
ఇట్లు.
మీ . ఏసన్న.
Download Hosanna Ministries Aananda Keerthanalu – 2015 PDF format
Download Hosanna Ministries Aananda Keerthanalu – 2018 PDF format
Leave a Reply