Manakai yesu maraninche mana papamula
korakai – nitya jeevamu nitchutake satyundu
sajeevudaaye
1. Thruneekarimpabade – visarjimpa badenu – dukha –
krantudaye vyasanamula bharinchenu “Mana”
2. Mana vyasanamula vahinchen mana dukkhamula
bharinchen – mana mennika cheyakaye – mana mukhamula
drippitimi “Mana”
3. Mana yatikramamula koraku – mana doshamula koraku
mana naadhudu siksha nonde – manaku swastata kalige
“Mana”
4. Gorrela vale thappitimi – parugidifmi mana daarin
arudenche kaapariyai – arpinchi praanamunu “Mana”
5. Dourjanyamu nondenu – baadimpa badenu – thana noru
theruvaledu – manakai krayadhana meeyan “Mana”
6. Edirimpaledevarin – lede kapatamu nota – Yehovaa
naluga gotten – mahaa vyaadhinikaliginchen “Mana”
7. Siluvalo vrelaaden – samaadhilo nundenu
sajeevundai lechen – stotramu halleluya “Mana”
మనకై యేసు మరణించె మన పాపముల కొరకై
నిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె
1. తృణీకరింపబడె విసర్జింపబడెను
దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను
|| మనకై యేసు ||
2. మన వ్యసనముల వహించెన్ – మన దుఃఖముల భరించెన్
మన మెన్నిక చేయకయే – మన ముఖముల ద్రిప్పితిమి
|| మనకై యేసు ||
3. మన యతిక్రమముల కొరకు – మన దోషముల కొరకు
మన నాథుడు శిక్షనొందె – మనకు స్వస్థత కలిగె
|| మనకై యేసు ||
4. గొర్రెలవలె తప్పితిమి – పరుగిడితిమి మనదారిన్
అరుదెంచె కాపరియై – అర్పించి ప్రాణమును
|| మనకై యేసు ||
5. దౌర్జన్యము నొందెను – బాధింపబడెను
తననోరు తెరువలేదు – మనకై క్రయధనమీయన్
|| మనకై యేసు ||
6. ఎదిరింప లేదెవరిన్ – లేదే కపటము నోట
యెహోవా నలుగగొట్టెన్ – మహావ్యాధిని కలిగించెన్
|| మనకై యేసు ||
7. సిలువలో వ్రేలాడెన్ – సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్ – స్తోత్రము హల్లెలూయ
|| మనకై యేసు ||