నే స్తుతించెదను యేసు నామమును

“క్రీస్తు మన కోసము శాపమై మనలను … శాపము నుండి విమోచించెను.” గలతీ Galatians 3:14

పల్లవి : నే స్తుతించెదను యేసు నామమును – భజించెదను క్రీస్తు నామమును
స్తుతికి యేసే యోగ్యుడని – నిత్యం నిత్యం నే స్తుతించెదను

1. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ – వర్ణింప నెవ్వరికి తరమౌనా?
పాపిని నన్ను రక్షించుటకై – చూపేను ప్రేమన పారముగా
|| నే స్తుతించెదను ||

2. పాపములన్నియు బాపుటకై – శాపములన్నియు మాపుటకై
ఏ పాపమెరుగని ఆ పావనుడు – శాపగ్రాహియై చావొందెను
|| నే స్తుతించెదను ||

3. శోధన కాలముల యందున – వేదన కాలముల యందున
నాధుడు యేసు మనతోడనుండ – అంతమేగా మన చింతలకు
|| నే స్తుతించెదను ||

4. ఎనలేని ప్రేమతో కౌగిలించెను – ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను
మహామహుండు మహిమ ప్రధానుడు – మహిమతో వచ్చును మేఘముపై
|| నే స్తుతించెదను ||

5. రాజాధిరాజు ప్రభు యేసే – దేవాదిదేవుడు మన యేసే
పరమందు దూతలు యిహమందు నరులు – పాడుడి ప్రభునకు హల్లెలూయా
|| నే స్తుతించెదను ||

స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు

“శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను” యిర్మియా Jeremiah 31:3

పల్లవి : స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు – 2
నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే – 2
జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే – 2

1. ప్రేమించెను నిన్ను ఆయనే – శాశ్వత ప్రేమచే
ఏర్పరచు కొనె నిన్ను – భూమి పుట్టకమునుపే
దేవుడే నరరూపియాయె – ఆయన పేరు యేసు ప్రభు – 2 – ఆయన
|| స్తుతించు ||

2. యాకోబును సృజియించే – ఇశ్రాయేలుకు రూపునిచ్చే
నీకు తోడైయుందున్ – భయపడకుమని పలికె
పేరు పెట్టి పిలిచి – నా సొత్తు నీవనెను – నా సొత్తు నీవనెను
|| స్తుతించు ||

3. ప్రేమించి నన్ను రక్షించే – స్తుతి చెల్లించి పూజింతున్
తన రూపము నాకు నిచ్చే – ఆరాధించి ఘనపరతున్
పరలోక పౌరినిగ చేసెన్ – హౄదయార్పన నర్పింతున్
|| స్తుతించు ||

4. సహవాసములో నిలిచి – ప్రత్యక్షత యందుండి
ఏమి సంభవించిననూ – ప్రభు పక్షము నుండవలెన్
అంతమందు బహుమానమిత్తున్ – అని ప్రభువే చెప్పెనుగా
|| స్తుతించు ||