యేసు దివ్య రక్షకుని స్తుతించు

“నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.” కీర్తన Psalm 103:1

1. యేసు దివ్య రక్షకుని స్తుతించు – భూమీ – దివ్య ప్రేమను చాటుము
ముఖ్యదూతలారా శుభ మహిమను – బలఘనముల నర్పించుడి
మోయురీతి యేసు కాపాడు మిమ్మున్ – చేతులందు మోయుచుండును
సీయోను వాసులగు భక్తులారా – సంతోష గీతములు పాడుడి

2. యేసు దివ్యరక్షకుని స్తుతించు – పాపమునకై మరణించెను
బండ నిత్యరక్షణ నిరీక్షణుండు – సిల్వ వేయబడిన యేసుడు
రక్షకా భరించితి దుఃఖ వార్థిన్ – ముండ్ల మకుట ధారివైతివి
త్యజింపబడి చేయి వీడబడిన – మహిమా ప్రభూ నీకే స్తోత్రము

3. యేసు దివ్య రక్షకుని స్తుతించు – నాక గుమ్మములారా పాడుడి
యేసు నిత్యానిత్యము రాజ్యమేలున్ – గురుద్దేవ రాజు నాయనే
.మరణ విజయుడు మాదు రాజు – మృత్యువా నీ ముల్లు యెక్కడ?
యేసు జీవించియున్న జయవీరుండు – నీ గుమ్మముల్ కీర్తించి పాడనీ

యేసు ప్రభును స్తుతించుట

“యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించియున్న నా దుర్గము.” కీర్తన Psalm 18:2

పల్లవి : యేసు ప్రభును స్తుతించుట
యెంతో యెంతో మంచిది

1. విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను
|| యేసు ||

2. ఎంతో గొప్ప రక్షణ నిచ్చి
వింతైన జనముగా మము జేసెను
|| యేసు ||

3. మా శైలము మా కేడెము
మా కోటయు మా ప్రభువే
|| యేసు ||

4. ఉన్నత దుర్గము రక్షణ శృంగము
రక్షించువాడు మన దేవుడే
|| యేసు ||

5. అతిసుందరుడు అందరిలోన
అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు
|| యేసు ||

6. రాత్రింబవళ్ళు వేనోళ్ళతోను
స్తుతుంచుటయే బహు మంచిది
|| యేసు ||