ఆరాధనలకు యోగ్యుడవు

“వారు వధింపబడిన గొర్రెపిల్ల, శక్తియు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి” ప్రకటన Revelation 5:12

పల్లవి : ఆరాధనలకు యోగ్యుడవు – స్తుతి గీతంబులకు పాత్రుడవు
ప్రభుయేసు నిన్ను పూజింతును – మనసార నిన్నే కీర్తించ్తును
ఆరాధనలకు – యోగ్యుడవు

1. భరియించితివి నా రోగములన్ – భరియించితివి నా వ్యసనములన్
అరిగితివి నాకై కలువరికి – పరిహరించితివి పాప శిక్షన్
|| ఆరాధనలకు ||

2. నా యతిక్రమములకై గాయపడి – నా దోషములకై కొట్టబడి
చిందిన సిలువ రక్తములో – నా దారిద్ర్యము తొలగించితివి
|| ఆరాధనలకు ||

3. నశియించిన నను వెదకితివి – నశియించిన నను లేపితివి
నా శాపమును చూపించితివి – నీ శాంతముతో క్షమించితివి
|| ఆరాధనలకు ||

హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్

“నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను.” కీర్తన Psalm 146:2

పల్లవి: హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్ని వేళల యందున నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్

1. వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే
నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

2. నాదు శత్రువులను – పడద్రోయు వాడవు నీవే
మహా సామార్థ్యుడవు – నా రక్షణ శృంగము నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

3. ఎందరు నిను చూచిరో – వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నే వేలుగొందితిన్ – నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

4. భయమును పారద్రోలి – అభయము నిచ్చితివి
ఎబినేజరు నీవై ప్రభు – నన్ను సంరక్షించుచుంటివి
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

5. కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును
నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్

6. ఈ జీవిత యాత్రలో – ఏమి సంభవించిన
మహిమా నీకే ఓ ప్రభూ – ఇదియే నా దీన ప్రార్థనా
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్