మహిమ, ఘనత, స్తుతి ప్రభావము

“స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక.” ప్రకటన Revelation 5:13

పల్లవి : మహిమ, ఘనత, స్తుతి ప్రభావము – నీకే కలుగును గాక ఆ. ఆ.
నీకే కలుగును గాక మా దేవా – నీకే కలుగును గాక !

1. బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు – నీ దానములే జ్ఞాన స్వరూపి (2)
జగమును సౄష్టించి – నిర్వహించు వాడవు (2)
నీ జ్ఞానమును – వివరింపతరమా (2)
నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా – నీ జ్ఞానముతో నింపు మమ్ము
|| మహిమ ||

2. వెండి బంగారు అష్టైశ్వర్యములు – నీ దానములే శ్రీ మంతుడా
శ్రేష్ఠ ఈవులనిచ్చు – జ్యోతీర్మయుడవు
నీ మహిమైశ్వర్యం – వివరింపతరమా
నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా – నీ మహిమైశ్వర్యమిమ్ము
|| మహిమ ||

3. అధిక బలము సంపూర్ణ శక్తి – నీ దానములే యుద్దశూరుడా
నీ కసాద్యమైనది లేదే యెహోవా
నీ సర్వశక్తిని – వివరింపతరమా
నీ సర్వశక్తితో నింపు మా దేవా – నీ సర్వశక్తితో నింపు
|| మహిమ ||

4. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ – జ్ఞానమునకు మించు ప్రేమాస్వరూపీ
కొలువగలేము నీ – ఘనప్రేమను
సాటిలేని నీ ప్రేమన్ వివరింపతరమా
నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా – నీ ప్రేమతో నింపు మమ్ము
|| మహిమ ||

5. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని – అగాధ సముద్రముల్ జ్వాలామయుడా
మరణమంత బలమైన – నీ ప్రేమ ధాటిని
అగపె ప్రేమను – వివరింప తరమా
అగపే ప్రేమతో నింపు మా దేవా – అగపే ప్రేమతో నింపు
|| మహిమ ||

నా మనోనేత్రము తెరచి

“మీ మనో నేత్రములు వెలిగింపబడినందున” ఎఫెసీ Ephesians 1:17

పల్లవి : నా మనోనేత్రము తెరచి
నా కఠిన హృదయమును మార్చి (2)

అనుపల్లవి : అంధకారములో నేనుండ (2)
వెదకి నన్ రక్షించితివి (1)

1. నే పాప భారము తోడ – చింతించి వగయుచు నుంటి (2)
కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) – పొందినన్ విడిపించితివి (1)
|| నా మనోనేత్రము ||

2. వేరైతి లోకము నుండి – నీ స్వరమును విని నినుచేర
సర్వము నే కోల్పోయినను – నీ స్వరమే నా స్వాస్థ్యమయా
|| నా మనోనేత్రము ||

3. ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? – నీకై జీవించెద ప్రభువా!
బాధలు శోధనలు శ్రమలలో – ఓదార్చి ఆదుకొంటివయా
|| నా మనోనేత్రము ||

4. ఏమి నీ కర్పించగలను – ఏమీ లేని వాడనయ్యా
విరిగి నలిగిన హృదయముతో – అర్పింతు ఆత్మార్పణను
|| నా మనోనేత్రము ||

5. నీ సన్నిధిని నే కోరి – నీ సన్నిధిలో నేమారి
స్తుతి పాత్రగ ఆరాధింతున్ – యుగ యుగములు సర్వయుగములు
|| నా మనోనేత్రము ||