గాయములన్ గాయములన్

“మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను.” యెషయా Isaiah 53:5

పల్లవి : గాయములన్ గాయములన్ – నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు

1. సురూపమైన సొగసైన లేదు – దుఃఖ భరితుడాయెను
వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ – వీక్షించి త్రిప్పిరి ముఖముల్
|| గాయములన్ ||

2. మా రోగములను మా దుఃఖములను – మనకై తానే భరియించె
మొత్తబడెను బాధించబడెను – యెంతో శ్రమనొందె మనకై
|| గాయములన్ ||

3. మా అతిక్రమ క్రియలను బట్టి – మరి నలుగగొట్టబడెను
తాను పొందిన దెబ్బలద్వారా – స్వస్థత కలిగె మనకు
|| గాయములన్ ||

4. పాపంబు కపటంబు లేదు ప్రభునందు – మౌనము వహియించె మనకై
ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించె – ప్రభువే ఘోర సిలువపై
|| గాయములన్ ||

5. క్రీస్తు ప్రేమను మరువజాలము – యెంతో ప్రేమించె మనల
సిలువపై మేము గమనించ మాకు – విలువైన విడుదల గలిగె
|| గాయములన్ ||

నా ప్రాణమా నా సర్వమా

“ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.” కీర్తన Psalm 103

పల్లవి : నా ప్రాణమా నా సర్వమా – ఆయన పరిశుద్ధ నామమునకు
సదా స్తుతులను చెల్లించుమా – మరువకు ఆయన మేలులను

1. క్షమించును నీ పాపములను – కుదుర్చును నీ రోగములను
కీడు నుండి నీ ప్రాణమును రక్షించి – కరుణా కిరీటము దయచేయును
|| నా ప్రాణమా ||

2. పడమటికి తూర్పెంత దూరమో – పాపములన్నియు దూరపరచెను
తండ్రి తన తనయులపై జాలిపడునట్లు – భక్తుల యెడల జాలిపడును
|| నా ప్రాణమా ||

3. నిన్ను మేలులతో తృప్తి పరచున్ – నీ యౌవనము నూతన పరచును
బాధితులకు బహున్యాయము తీర్చు – యెహోవా యెంతో దయాళుడు
|| నా ప్రాణమా ||

4. మనము నిర్మింప బడినరీతి – మంటి వారమని ప్రభు యెరుగును
గడ్డి పువ్వువలె నున్నది మన బ్రతుకు – గాలి వీచగ అది యెగిరిపోవున్
|| నా ప్రాణమా ||

5. స్థిరపరచె తన సింహాసనము – సర్వలోకమును యేలు చుండె
నీ యాజ్ఞలను పాలించెదము – నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా
|| నా ప్రాణమా ||