ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.” యోహాను John 3:16

పల్లవి : ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి
తన కుమారుని పంపెను రక్తము చిందించి
మా పాపము కడుగ సిలువపై అర్పించెను

1. త్యాగసహిత ప్రేమజూపి నెరవేర్చె తన నిబంధనను
మనలను తానే నిర్మించె గనుక మనలను ప్రేమించెను
|| ప్రేమ ||

2. శాశ్వత ప్రేమ చూపించెను సిలువపై ఋజువు గావించెను
తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల జేసెనుగా
|| ప్రేమ ||

3. తండ్రివలెనే ప్రేమజూపి నీచులనెల్ల ప్రేమించెను
ఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును
|| ప్రేమ ||

4. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా
తన మహా ప్రేమ జూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను
|| ప్రేమ ||

5. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతము
హల్లెలూయ స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే
|| ప్రేమ ||

ప్రభువా నీదు ఘననామమున్ మేము

“ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు”  ఫిలిప్పీ Philippians 2:10

పల్లవి : ప్రభువా నీదు ఘననామమున్ మేము
పొగడిపాడ హృదయ ముప్పొంగెనే – యేసు
ప్రియుడా నీ పాద సన్నిధి చేర
నాలో నీదు ప్రేమ అధికంబాయనే

1. ఇహ పరము పొగడునట్టి ఘననామమే
ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే
శ్రమలన్ని బాపునట్టి ఘననామమే
భక్తులెల్ల వేళ పొగడిపాడు ఘననామమే
|| ప్రభువా ||

2. కీడునంత తొలగించు ఘననామమే
వెదకువారికెల్ల ఔషధమా ఘననామమే
సకల మేళ్ళనిచ్చునట్టి ఘననామమే
ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే
|| ప్రభువా ||

3. అపవాదిని తరిమినట్టి ఘననామమే
మమ్ము ప్రేమతోడ కౌగలించే ఘననామమే
పరిశుద్దులు పొగడునట్టి ఘననామమే
పరిశుద్దుల పరమున జేర్చు ఘననామమే
|| ప్రభువా ||