శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు!

“సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు” యెషయా Isaiah 6:3

1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు!
ప్రాతఃకాల స్తుతి నీకే చెల్లింతుము!
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా
ముగ్గురై యుండు దైవత్ర్యేకుడా!

2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందు
పరవాసులెల్ల నిన్నే శ్లాఘింతురు
సెరాపుల్ కెరూబులు సాష్టాంగపడి
నిత్యుడవైన నిన్ స్తుతింతురు

3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ
పాపి కన్ను చూడలేని మేఘవాసివి
అద్వితీయ ప్రభు, నీవు మాత్రమేను
కరుణ, శక్తి, ప్రేమ రూపివి

4. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు
సృష్టి జాలమంత నీకీర్తి బాడును
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా!
ముగ్గురై యుండు దైవత్ర్యేకుడా!

నమస్కరింప రండి – దావీదు పుత్రుని

“రండి నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము.” కీర్తన Psalm 95:7

1. నమస్కరింప రండి – దావీదు పుత్రుని
శ్రీ యేసు రక్షకుండు – ఏతెంచె నేలను
న్యాయంబు లోకమందు – స్థాపించి నిత్యము
అన్యాయమంత దాను – పోగొట్ట వచ్చెను

2. వర్షంబు పడునట్లు – శుష్కించు నేలను
దుఃఖించు వారికెల్ల – హర్షంబు నిచ్చును
శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరు
ఖర్జూర వృక్షరీతిన్ వర్థిల్లు చుందురు

3. దిగంత వాసులైన – భూరాజులందరు
శ్రీ యేసు చరణంబుల్ నమస్కరింతురు
భూలోకవాసులైన – జనంబులందరు
క్రీస్తే స్వాధీనమందు జీవింతు రెప్పుడు

4. విరోధులైన వారిన్ – జయింప నెన్నడున్
సింహాసనంబు మీద – నాసీనుడగును
అత్యంత ప్రేమమూర్తి – శ్రీ యేసు ప్రభువు
ఆ దివ్యనామ కీర్తి – వ్యాపించు నీ భువిన్