అత్యంత సుందరుండును

“నన్ను ప్రేమించి నా కొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” గలతీ Galatians 2:20

అత్యంత సుందరుండును
ఎల్లరి కాంక్షణీయుడు
దేవాది దేవుడైన మా
కల్వరి యేసు నాథుడు

పల్లవి : కల్వరి నాథుడా – నన్ను జయించితి
రక్షింప మృతుడైన – కల్వరి యేసు నాథుడా

1. గాయపడి శ్రమలతో
పాపదుఃఖము మోసితివి
సిల్వలో మరణించితివి
దుఃఖ కల్వరి నాథుడా
|| కల్వరి ||

2. శాంతి జీవము నీయను
ఖైదీల విమోచనమునకై
రక్తపు ఊట తెరచితివి
ప్రేమ కల్వరి నాథుడా
|| కల్వరి ||

3. తెచ్చిన ఈవులెల్లను
మేలుకొరకు మనకిచ్చి
ప్రేమనదిని పోసెను
దయాకల్వరి నాథుడు
|| కల్వరి ||

4. మహిమ పూర్ణుడగు నిన్ను
కండ్లార చూతుమనుటయే
ఇచ్చట మా ఆదరణ
సాటిలేని కల్వరీ ప్రభూ
|| కల్వరి ||

5. స్పటిక సముద్ర తీరమున
నీ ప్రేమయందు మున్గుచు
నీ వలె నుందు నిత్యము
మహిమ కల్వరి నాథుడా
|| కల్వరి ||

యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు

“ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేసిరి.” ప్రకటన Revelation 4:10

యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు
మా స్తుతులను చెల్లించెదము
నీ సన్నిధియందు నిన్నారాధించి
పాత్రుండ వీవంచు కీర్తింతుము

పల్లవి : పాత్రుండవీవే పాత్రుండవీవే
పాత్రుండవీవే మాప్రభు నీవే
నీ సన్నిధియందు నిన్నారాధించి
పాత్రుండవీవంచు కీర్తింతుము

1. దేవుడౌ నీవు నరరూపమెత్తి
దూతలకన్న తగ్గింపబడి
స్త్రీ సంతానమౌ నీవు మరణించి
సర్పము తల నణగ ద్రొక్కితివి
|| పాత్రుండవీవే ||

2. నీ సృష్టియే సిల్వయొద్దకు నిన్ను
నడ్పి సిల్వన్ మేకులతో కొట్టిరి
దైవ మానవులచే వీడబడి
శాప నష్ట మనుభవించితివి
|| పాత్రుండవీవే ||

3. మహిమతో మరణమును గెల్చి
గొప్ప విజయము పొందితివి
చావు సమాధులపై విజయుండా
నిన్ను స్తుతింపక నెట్టులుందును
|| పాత్రుండవీవే ||