దేవా నీ తలంపులు అమూల్యమైనవి

“దేవా! నీ తలంపులు నాకెంత ప్రియమైనవి” కీర్తన Psalm 139:17

పల్లవి : దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది
1. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే – స్తుతి పాడెద హృదయముతో
స్తుతించి వర్ణించి ఘనపరతున్ – నీవే నా రక్షకుడవని
|| దేవా ||

2. మొదట నిన్ను యెరుగనైతిని – మొదటే నన్ను యెరిగితివి
వెదుకలేదు ప్రభువా నేను – వెదకితివి యీ పాపిని
|| దేవా ||

3. మరణమగు వూబిలో నుంటిని – కరుణ నిలిచె నన్ను రక్షింప
మరణము నుండి రక్షింప నన్ – నా ప్రభు బలియాయెను
|| దేవా ||

4. పాపలోకములో మునిగి యుంటిని – పాప శిక్షకు పాత్రుడను
యేసు ప్రభు సిలువ సహించెను – నాకు నూతన జీవ మొసగ
|| దేవా ||

5. అద్భుతమైనది సిలువ దృశ్యం – ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి
ప్రభును వర్ణింప నశక్యము – ప్రభువే సహించె దుఃఖము
|| దేవా ||

6. యెట్లు మౌనముగా నుందు ప్రభూ – చెల్లింపక స్తోత్ర గీతము
కాలమంతా పాడుచుండెద – నీ ప్రేమ అపారమైనది
|| దేవా ||

ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే

“నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు …. మార్చియున్నావు” కీర్తన Psalm 30:11

పల్లవి : ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే
యెంతో ఆనందం వర్ణింపజాల యెంతో ప్రభువు ప్రేమ
హృదయమా పాడుమా
1. క్రీస్తునందు స్వాస్థ్యము చేసె – తన సంకల్పం అద్భుతమది
భూమి పునాది వేయక మునుపే – ఏర్పరచుకొనెను
హృదయమా పాడుమా
|| ఓ నా హృదయమా ||

2. క్రీస్తునందు నన్ను క్షమించి – రక్తము కార్చి కడిగెను నన్ను
విడిపించి నన్ను నీతిగా తీర్చి – పవిత్ర పరచెను
హృదయమా పాడుమా
|| ఓ నా హృదయమా ||

3. క్రీస్తులో నన్ను దరికి పిల్చి – చేర్చి క్రొత్త వ్యక్తిగ జేయ
కూల్చెను ప్రభు ఆ మధ్యపు గోడ – కోరి చేరియుండెను
హృదయమా పాడుమా
|| ఓ నా హృదయమా ||

4. క్రీస్తులోయున్న యే శిక్షలేదు – స్వాతంత్ర్యము క్రీస్తునందే
క్రీస్తే పరమున కూర్చుండబెట్టి – క్రొత్త సృష్టిగ జేసె
హృదయమా పాడుమా
|| ఓ నా హృదయమా ||

5. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం – శాంతి ఆనందం దొరికెను మనకు
క్రీస్తు మహిమ జయమునకై పిలిచె – హల్లెలూయ పాటను
హృదయమా పాడుమా
|| ఓ నా హృదయమా ||