నా ప్రాణ ప్రియుడా యేసురాజా

“ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.” యెషయా Isaiah 9:6

పల్లవి : నా ప్రాణ ప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో – సత్యముగా

1. అధ్భుతకరుడా ఆలోచన – ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహు ప్రియుడా
మనోహరుడా మహిమరాజా – స్తుతించెదన్
|| నా ప్రాణ ప్రియుడా ||

2. విమోచన గానములతో – సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా
|| నా ప్రాణ ప్రియుడా ||

3. గర్భమున పుట్టిన బిడ్డను – కరుణింపక తల్లి మరచునా
మరచిన గాని నీవెన్నడు
మరువవు విడివవు ఎడబాయవు – కరుణారాజా
|| నా ప్రాణ ప్రియుడా ||

4. రక్షణాలంకారములను – అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నా కొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు – స్తుతింతును
|| నా ప్రాణ ప్రియుడా ||

5. నీ నీతిని నీ రక్షణను – నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతుల తోడ
నీ ప్రేమను నే వివరింతును – విమోచకుడా
|| నా ప్రాణ ప్రియుడా ||

6. వాగ్దానముల్ నాలో నెరవేరెన్ – విమోచించి నా కిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ
|| నా ప్రాణ ప్రియుడా ||

హర్షింతును – హర్షింతును

“అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను, ఒలీవచెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొఱ్ఱలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును.” హబక్కూకు Habakkuk 3:17-19

పల్లవి : హర్షింతును – హర్షింతును
నా రక్షణకర్త – నా దేవుని యందు

1. అంజూరపు చెట్లు – పూయకుండినను
ద్రాక్ష చెట్లు – ఫలింపకున్నను
|| హర్షింతును ||

2. ఒలీవ చెట్లు – కాపు లేకున్నను
చేనిలోని పైరు – పండకున్నను
|| హర్షింతును ||

3. దొడ్డిలో – గొర్రెలు లేకపోయినను
సాలలో పశువులు లేకపోయినను
|| హర్షింతును ||

4. లేడి కాళ్ళవలె నా కాళ్ళను జేసి
ఉన్నత స్థలముల – మీద నడుపున్
|| హర్షింతును ||

5. నా కోట నా బలము – నా యెహోవా
నీ యందు నిత్యం – నే హర్షింతున్
|| హర్షింతును ||