కరుణాసంపన్నుడా ధీరుడా


కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద (2)
నా పైన ప్రేమ చూపించి
నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వికుడా
నీ కోసమే నా జీవితం – (2)    ||కరుణా||

1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము
నా హృదయసీమలోనే సందడిని చేసెను (2)
అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే
ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను (2)
ఆ వాక్యమే ఆరోగ్యమై…
జీవింపజేసే నన్నే నడిపించెను      ||కరుణా||

2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని
ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని (2)
నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే
అనుదినము మకరందమే నీ స్నేహబంధము (2)
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను…
నడిపించుమా స్థిరపరచుమా    ||కరుణా||

3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై
నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది (2)
నా కోసం నిర్మించే సౌందర్యనగరములో
ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం (2)
తేజోమయా నీ శోభితం…
నే పొందెద కొనియాడెద    ||కరుణా||

 


 

Karunasampannudaa Dheerudaa Sukumaarudaa
Nee Prabhava Mahimalane
Nirantaram Nenu Prakatincheda (2)
Naa Paina Prema Choopinchi
Naa Koraku Tyaagamaitive
Naa Yesayya Saathvikudaa
Nee Kosame Naa Jeevitam – (2)
|| Karunasampannudaa ||

1.
Eenadu Nanu Veedani Nee Prema Sandeshamu
Naa Hridayaseemalone Sandadni Chesenu (2)
Anuvanuvunu Balaparache Nee Jeevipa Vaakyame
Pratikshanamu Dari Cheri Nanne Taakenu (2)
Aa Vaakyame Aarogyamai…
Jeevimpajesenu Nanne Nadipinchenu
|| Karunasampannudaa ||

2.
Ee Vinta Lokamlo Nee Chenta Cheritini
Enaleni Prematone Aadarana Ponditini (2)
Nee Krupalo Nilipinadi Nee Premabandhame
Anudinamu Makarandame Nee Snehabandhamu (2)
Aa Premalone Kadavarakunu Nannu…
Nadipinchuma Sthiraparachuma
|| Karunasampannudaa ||

3.
Ne Vechiyunnanu Nee Mahima Pratyakshatakai
Naakunna Ee Nireekshane Sannidhilo Nilipinadi (2)
Naa Kosam Nirmisey Soundaryanagaramulo
Pranamilli Chesedanu Nee Paadaabhivandanam (2)
Tejomayaa Nee Shobhitham…
Ne Pondeda Koniyadeda
|| Karunasampannudaa ||

పాడేద స్తుతి గానము

పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము | Hosanna Ministries 32rd Volume 2022 Song Lyrical


పాడేద స్తుతి గానము
కొనియాడేద నీ నామము  (2)
నీవే నా ప్రేమానురాగం
క్షణమైన విడువనీ స్నేహం
అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా  (2)  || పాడేద ||

1. ఇలా నాకేవ్వరు లేరనుకోగా నా దరి చెరితివే
నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు  (2)
నీ ఆశాలే నాలో చిగురించెను
నీ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
నీ అనుబంధము నాకానందమే   (2)  || పాడేద ||

2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను నే రుధిదారాలే
నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే  (2)
నీ చేతులే నను నిర్మించెను
నీ రూపమే నాలో కలిగెను  (2)
నీ అభిషేకము పరమానందమే  (2)  || పాడేద ||

3. బలహీనతలో నను బలపరచి ధైర్యము నింపితివే
నా కార్యము సఫలము చేసి ఆత్మతో నింపితివే (2)
యూదగోత్రపు కొదమ సింహమా
నీతో నిత్యము విజయ (2)
నీ పరిచర్యలో మహిమానందమే (2) || పాడేద ||

 


 

Paadeda Stuti Gaanamu
Koniyaadeda Nee Naamamu (2)
Neeve Naa Premaanuraagam
Kshanamaina Viduvanee Snehham
Atishreshthudaa Naa Yesayya (2)
|| Paadeda ||

1.
Ilaa Naakevvuru Leranukogaa –
Naa Dari Cheritive
Ne Namminavare Nanu Marachinanu –
Maruvani Devudavu (2)
Nee Aashaale Naalo Chigurinchenu
Nee Vaakyame Nannu Bratikinchenu (2)
Nee Anubandhamu Naakaanandame (2)
|| Paadeda ||

2.
Naa Prati Anuvunu Parishuddha Parachenu –
Ne Rudhidaarale
Nee Darshaname Nanu Nilipinadi –
Dharanilo Nee Korake (2)
Nee Chetule Nanu Nirminchenu
Nee Roopame Naalo Kaligenu (2)
Nee Abhishekamu Paramaanandame (2)
|| Paadeda ||

3.
Balaheenatalo Nanu Balaparachi –
Dhairyamunimpitive
Naa Karyamu Safalamu Chesi –
Aatmatonimpitive (2)
Yooda Gotrapu Kodama Simhama
Neeto Nityamu Vijaya (2)
Nee Paricharyalo Mahimaanandame (2)
|| Paadeda ||