జగములనేలే పరిపాలక

జగములనేలే పరిపాలక | సుకుమారుడా | Hosanna Ministries 2025 New Album Song-3


Lyrics: Telugu

జగములనేలే పరిపాలక
జగతికి నీవే ఆధారమా
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము
పాడెద నిరతము ప్రేమగీతము

యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
//జగమునేలే పరిపాలక//

1. మహారాజుగా నా తోడువై
నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నీవు మోయగా
సులువాయే నా పాయనము
నీ దయచేతనే కలిగిన క్షేమము –
ఎన్నడు నను వీడదే (2)
నీ సన్నిధిలో పొందిన మేలు –
తరగని సౌభాగ్యమే  (2) || యేసయ్యా ||

2. సుకుమారుడా నీ చరితము
నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా
నేనెంతో ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభతరుణం –
నాకిది నీ భాగ్యమా (2)
జీవితమంతా నీకర్పించి –
నీ రుణము నే తీర్చనా (2)  || యేసయ్యా ||

3. పరిశుద్ధుడా సారధిమై
నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన
ప్రతి మలుపు నీ చిత్రమే
నా విశ్వాసము నీ పైనుంచి –
విజయము నే చాటనా (2)
నా ప్రతిక్షణము ఈ భావనతో –
గురియొద్దకే సాగెద (2)  || యేసయ్యా ||

 


Jagamulanele Paripaalaka | Hosanna Ministries 2025 New Album Song-3

Lyrics: English

Jagamulanele Paripaalaka
Jagamulanele Paripaalaka
Jagathiki Neeve Aadhaarama
Aathmatho Manasutho Stothra Gaanamu
Paadeda Niratamu Premageethamu

Yesayya Yesayya Nee Krupaa Chaalayya
Yesayya Yesayya Nee Premee Chaalayya
// Jagamunalele Paripaalaka //

1. Maharaajugaa Naa Thoduvai
Nilichavu Prathi Sthalamuna
Naa Bhaaramu Neevu Moyagaa
Suluvaaye Naa Paayanamu
Nee Dayachethane Kaligina Kshemamu –
Ennadu Nanu Veedade (2)
Nee Sannidhilo Pondina Melu –
Taragani Saubhaagyame (2) || Yesayya ||

2. Sukumaarudaa Nee Charithamu
Neenentha Vivarinthunu
Nee Mahimanu Prakatinchagaa
Neenentho Dhanyudanu
Ghanulaku Leede Ee Shubha Tarunam –
Naakidi Nee Bhaagyamaa (2)
Jeevithamanthaa Neekarpinchi –
Nee Runamu Nee Theerchanaa (2) || Yesayya ||

3. Parishuddhudaa Saaradhimai
Nadipinchu Siyonuke
Naa Yathralo Nee Daatina
Prathi Malupu Nee Chitrame
Naa Vishwasamu Nee Painunchi –
Vijayamu Nee Chaatanaa (2)
Naa Prathikshanamu Ee Bhaavanatho –
Guriyoddake Saageda (2) || Yesayya ||

ఆశ్రయుడా నా యేసయ్య

ఆశ్రయుడా నా యేసయ్య  | ఆశ్రయుడా | Hosanna Ministries 2025 New Album Song-5


Lyrics: Telugu

ఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమప్రభావము నీకేనయ్యా (2)
విశ్వవిజేతవు – సత్యవిధాతవు
నిత్యమహిమకు ఆధారము నీవు (2)
లోకసాగరాన కృంగినవేళ
నిత్యమైనకృపతో వాత్సల్యము చూపి
నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయ్యా ఆరాధనా
నీకేనయ్యా స్తుతిఆరాధనా (2)
                                       ||ఆశ్రయుడా||
1. తెల్లని వెన్నెలకాంతివి నీవు
చల్లని మమతల మనసే నీవు (2)
కరుణనిచూపి కలుషముబాపి
నను ప్రేమించిన ప్రేమవు నీవు (2)
జనులకు దైవం జగతికి దీపం
నీవుగాక ఎవరున్నారు ?
నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహరాజువు (2)
                                       ||ఆశ్రయుడా||
2. జీవితదినములు అధికములగునని
వాగ్దానముచేసి దీవించితివి (2)
ఆపత్కాలమున అండగనిలిచి
ఆశలజాడలు చూపించితివి (2)
శ్రీమంతుడవై సిరికే రాజువై
వ్యధలనుబాపి నా స్థితిమార్చితివి
అనురాగమే నీ ఐశ్వర్యమా
సాత్వికమే నీ సౌందర్యమా (2)
                                       ||ఆశ్రయుడా||
3. నీ చిత్తముకై అరుణోదయమున
అర్పించెదను నా స్తుతిఅర్పణ (2)
పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క
మహిమైశ్వర్యము నేపొందుటకు (2)
ప్రతివిషయములో స్తుతి చెల్లించుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థించెదరు
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా (2)
                                       ||ఆశ్రయుడా||

 


Ashrayuda | Hosanna Ministries 2025 New Album Song-5

Lyrics: English

Aashrayudaa Naa Yesayya
Stuthi Mahima Prabhaavamu Neekenayya(2)
Vishwavijetavu – Satyavidhaatavu
Nitya Mahimaku Aadhaaramu Neevu (2)
Loka Saagaraana Krungina Vela
Nityamainakrupatho
Vaathsalayamu Choopi

Nanu Cheradeesina Nirmaludaa
Neekenayya Aaradhana
Neekenayya Stuthi Aaradhana (2)
|| Aashra ||

1. Tellani Vennela Kaanthivi Neevu
Challani Mamatala Manase Neevu (2)
Karunanichoopi Kalushamu Baapi
Nanu Preminchina Premavu Neevu (2)
Janulaku Daivam Jagathiki Deepam
Neevugaka Evarunnaaru?
Neeve Neeve Ee Srushtilo
Koniyadabaduchunna Maharajuva (2)
|| Aashra||

2. Jeevitha Dinamulu Adhikamulagunani
Vaagdaanamu Chesi Deevinchitivi (2)
Aapathkaalamuna Andagani Lichi
Aashala Jaadalu Choopinchatavi (2)
Sreemantudavai Sirike Raaju Vai
Vyadhalanu Baapi Naa Sthiti Maarichitivi
Anuraagame Nee Aishwaryamaa
Saathvikame Nee Soundaryamaa (2)
|| Aashra||

3. Nee Chittamukai Arunodhayamuna
Arpinchedanu Naa Stuthi Arpanam (2)
Parishuddhulalo Nee Swaasthyamu Yokka
Mahimaishwaryamu Ne Pondutaku (2)
Prathi Vishayamulo Stuthi Chellinchuchu
Parishuddhaathmalo Prardhinchedaru
Parishuddhuda Paripoornuda
Nee Chittame Naalo Neravechuma (2)
|| Aashra||