ఊహకందని ప్రేమలోన భావమే నీవు

ఊహకందని ప్రేమలోన భావమే నీవు | Hosanna Ministries 2025 New Album Song-7


Lyrics: Telugu

ఊహకందని ప్రేమలోన భావమే నీవు..
హృదయమందు పరవసించుగానమే నీవు..
మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు..
మరపురాని కలల సౌధం గురుతులేనీవు..
ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు..
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు..
                                   || ఊహకందని ప్రేమ ||
1. తల్లడి తల్లే తల్లి కన్నా మించిప్రేమించి
తనువు తీరే వరకు నన్ను విడువలేనంది.. (2)
అదియే.. ఆ ఆ ఆ నే గాయపరచిన వేళలో
కన్నీరు కార్చిన ప్రేమగా
నులివెచ్చనైన ఒడికి చేర్చిఆదరించిన ప్రేమయే
నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయే.. (2)
                                   || ఊహకందని ప్రేమ ||
2. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా.. (2)
అదియే.. ఆ ఆ ఆ తన మహిమ విడిచిన త్యాగము
ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే
నీ సర్వమిచ్చిన దాతవు
నను హత్తుకున్న స్వామివి.. (2)
                                   || ఊహకందని ప్రేమ ||
3. దేహమందు గాయమైతే కుదుట పడును కదా
గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడుకదా.. (2)
నీవే నీవే యేసయ్య
నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు..
ననుభుజముపైన మోసినఅలసిపోని ప్రేమవు
నీవు లేనిదే నా బ్రతుకులో
విలువంటూ లేనే లేదయ్యా .. (2)
                                   || ఊహకందని ప్రేమ ||

 


Oohakandani prema | Hosanna Ministries 2025 New Album Song-7

Lyrics: English

Oohakandani Premalona Bhaavame Neevu
Hrudayamandu Paravasinchuganame Neevu
Manasu Nindina Ramyamaina Gamyame Neevu
Marapurani Kalala Saudham Guruthuleneevu
Edabaayalenannaanija Snehame Neevu
Nee Prema Kaugililo Aanandame Neevu
|| Oohakandani Prema ||

Charanam 1:
Talladi Talle Talli Kanna Minchi Preminchi
Tanuvu Teere Varaku Nannu Viduvalenandi(2)
Adiye.. Aa Aa Aa Nee Gaayaparachina Velalo
Kanniru Karchina Premaga
Nulivechchainaina Odiki
Cherchi Aadarinchina Premaye
Nee Gundelo Nanu Cherchina
Nee Amaramaina Premaye.. (2)
|| Oohakandani Prema ||

Charanam 2:
Ningi Nelanu Kalipina Balamaina Vaaradhiga
Nela Korigina Jeevitanni Levanettenuga.. (2)
Adiye.. Aa Aa Aa Tana
Mahima Vidichina Tyaagamu
Ee Bhuviki Vachina Bhaagyamu
Nanu Datipoka Vedakina
Nee Madhuramaina Premaye
Nee Sarvamichchina Daathavu
Nanu Hattukunna Swaamivi.. (2)
|| Oohakandani Prema ||

Charanam 3:
Dehamandu Gaayamaite
Kuduta Padunu Kada
Gunde Gaayamu Gurtupattina
Narudu Ledukada.. (2)
Neeve Neeve Yesayya
Naa Antharangamu Tarachi
Chusina Gaadhamaaina Premavu..
Nanubhujamupaina
Mosina Alasi Poni Premavu
Neevu Lenide Naa Brathukulo
Viluvantu Lene Ledayya.. (2)
|| Oohakandani Prema ||

కురిసింది తొలకరి వాన నా గుండెలోన

కురిసింది తొలకరి వాన నా గుండెలోన | Hosanna Ministries 2025 New Album Song-6 Pas.FREDDY PAUL


Lyrics: Telugu

కురిసింది తొలకరి వాన నా గుండెలోన  (2)
చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై (2)
నీ నిత్య కృపయే వాత్సల్యమై
నీ దయయే హెర్మోను మంచువలే  (2)

పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన
ఆనందించి ఆరాధించెద నా యేసయ్య  (2)
                                         || కురిసింది ||
1. దూలినై పాడైన ఎడారిగా నను చేయక
జీవజల ఊటలు ప్రవహింపజేశావు (2)
కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక
సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు (2)
స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా (2)
                                           || పొంగి పొరలి ||
2. నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి
నా చీల మండలమునకు సౌందర్యమిచ్చితివి (2)
నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక
నీ ప్రభావ మేఘముతో సాక్షిగ నను నడిపితివి (2)
తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా (2)
                                           || పొంగి పొరలి ||
3. నా తొలకరి వర్షము నీవై చిగురింపజేసావు
నా ఆశల ఊహలలో విహరింపజేశావు (2)
నా కడవరి వర్షము నీవై ఫలింపజేసావు
నీ మహిమ మేఘములో నన్ను కొనిపోయెదవు (2)
హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగర (2)
                                           || పొంగి పొరలి ||

 


Kurisindhi Tolakari Vaana | Hosanna Ministries 2025 New Album Song-6 Pas.FREDDY PAUL

Lyrics: English

Kurisini Tolakari Vaana Naa Gundelona (2)
Chirujallula Upadeshamai
Nee Vaakyame Varshamai (2)
Nee Nitya Krupaye Vaathsalayamai
Nee Dayaye Hermonu Manchuvale (2)

Pongi Porali Pravahince Naa Jeevithana
Aanandinchi Aaradhincheda Naa Yesayya (2)
|| Kurisini ||

Charanam 1:
Doolinai Paadaina Edariga Nanu Cheyaka
Jeevajala Ootalu Pravahimpajesavu (2)
Kalathala Kanneeralo Kanumarugaiponiiyaka
Saakshi Meghamai Nireekshanaga Nilichavu (2)
Stuthulu Stothram Neekenayya Daya Saagara (2)
|| Pongi Porali ||

Charanam 2:
Nee Mandira Gummamuloni Ootalatho Shuddhi Chesi
Naa Cheela Mandalamunaku Soundaryamichitivi (2)
Nee Sannidhilo Niliche Bhaagyamu Kolponiyyaka
Nee Prabhava Meghamutho
Saakshiga Nanu Nadipithivi (2)
Tadisi Munigi Telethannayya Prema Saagara (2)
|| Pongi Porali ||

Charanam 3:
Naa Tolakari Varshamu Neevai Chigurimpajesavu
Naa Aashala Uuhalalo Viharimpajesavu (2)
Naa Kadavari Varshamu Neevai Phalimpajesavu
Nee Mahima Meghamulo Nannu Konipoyedavu (2)
Harshadhvanulatho Harshinchedanu
Karunaa Saagara (2) || Pongi Porali ||