దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే

పల్లవి : దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే

1. మా దోషములను నీవు నీ యెదుట – నుంచుకొని యున్నావు
నీ ముఖకాంతిలో మా రహస్య పా-పములు కనబడుచున్నవి
|| దేవా ||

2. మా దినములన్ని గడిపితిమి – నీ యుగ్రత భరించుచు
నిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము
|| దేవా ||

3. డెబ్బది సంవత్సరములేగా – మాదు ఆయుష్కాలము
అధిక బలమున్న యెడల యెనుబది – సంవత్సరములగును
|| దేవా ||

4. అయినను వాటి వైభవమంత – ఆయాసమే దుఃఖమే
అది త్వరగా గతించును మే-మెగిరి పోయెదము
|| దేవా ||

5. నీకే జెందవలసినట్టి భయము – కొలది పుట్టినట్టి
నీదు ఆగ్రహ క్రోధ బలము – ఎవ్వరికి తెలియున్
|| దేవా ||

6. మాకు నీ జ్ఞాన హృదయమును – కలుగునట్లు చేయుము
మాదినములు లెక్కించుటకు – మాకు నీవే నేర్పుము
|| దేవా ||

ప్రభువా తరతరముల నుండి – మాకు నివాసస్థలము నీవే

1. ప్రభువా తరతరముల నుండి – మాకు నివాసస్థలము నీవే
యుగ యుగములకు నీవే మా
దేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు

2. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు
పుట్టింపక మునుపే నీవు
వున్నావు, వున్నావు, వున్నావు, వున్నావు

3. నరపుత్రుల మంటికి మార్చి – తిరిగి రండని సెలవిచ్చెదవు
వేయి సంవత్సరములు నీకు
జామువలె, జామువలె, జామువలె, జామువలె

4. నీదు దుష్టికి వేయి ఏండ్లు – గతించిన నిన్నటి వలె నున్నవి
రాత్రి యందొక జాముకు సమముగ
నున్నవి, వున్నవి, వున్నవి, వున్నవి

5. నీవు వారిని పారగొట్టగ – వరద చేతనైన రీతి
గడ్డివలె చిగిరించి వాడి
పోయెదరు, పోయెదరు, పోయెదరు, పోయెదరు

6. ప్రొద్దుట మొలిచి చిగిరించును – సాయంతరమున కోయబడును
వాడబారును నీ కోపముచే
క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్

7. నీదు కోపము వలన మేము – క్షీణించు చున్నాము దేవా
నీ యుగ్రతను బట్టి దిగులు
పొందెదము, పొందెదము, పొందెదము, పొందెదము