సర్వజనులారా వినుడి – మీరేకంబుగా వినుడి

పల్లవి : సర్వజనులారా వినుడి – మీరేకంబుగా వినుడి

1. లోక నివాసులారా సామాన్యులు ఘనులేమి
దరిద్రులు ధనికులేమి – సర్వజనులారా వినుడి
|| సర్వజనులారా ||

2. నా హృదయ ధ్యానము పూర్ణ – వివేకమును గూర్చినది
నే పల్కెద జ్ఞానాంశముల – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

3. గూడార్థాంశము వినెద – చేతబట్టి సితార
మర్మము దెల్పెద నేను – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

4. నాకై పొంచిన దోషుల – క్రియలు నన్ను చుట్టన్
ఆపదలో భయపడనేల – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

5. తమ ధన సంపదనుబట్టి – పొగడుకొనెడు వారికి
నేనేల భయపడవలెను – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

6. ఎవడేరీతినైన నిత్యము బ్రతుకునట్లు
సోదరుని రక్షించలేడు – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

7. వాని నిమిత్తము దైవ – సన్నిధి ప్రాయశ్చిత్తము
చేయువాడెవ్వడు లేడు – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

8. ప్రాణ విమోచన ధనము – బహు గొప్ప దెన్నటికిని
తీరక యుండవలసినదే – సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

మన దేవుని పట్టణమందాయన

పల్లవి : మన దేవుని పట్టణమందాయన – పరిశుద్ధ పర్వతమందు
యెహోవా గొప్పవాడును – బహు కీర్తనీయుడై యున్నాడు

1. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన – సీయోను పర్వతము
ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది
|| మన దేవుని ||

2. దాని నగరులలో దేవుడాశ్రయముగా – ప్రత్యక్షంబగుచున్నాడు
రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి – భ్రమపడి త్వరగా వెళ్ళిరి
|| మన దేవుని ||

3. అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ – వేదన పట్టెను
తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల – పగులగొట్టుచున్నావు
|| మన దేవుని ||

4. సైన్యము లధిపతి యెహోవా దేవుని – పట్టణమునందు
మనము వినినట్టి రీతిగా జరుగుట – మనము చూచితిమి
|| మన దేవుని ||

5. మన దేవుడు నిత్యముగా దానిని స్థిర – పరచియున్నాడు
దేవా నీ ఆలయ మందున నీ కృపను ధ్యానించితిమి
|| మన దేవుని ||

6. దేవా నీ నామము ఎంత గొప్పదో – నీ సత్కీర్తియును
భూదిగంతముల వరకు అంత – గొప్పదై యున్నది
|| మన దేవుని ||

7. ఈ దేవుడు సదాకాలము మనకు – దేవుడై యున్నాడు
మనల నడిపించును మరణపర్యంతము – హల్లెలూయా ఆమెన్
|| మన దేవుని ||