నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము

పల్లవి : నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము
దేవా … నా … దేవా

1. నాకు త్రోవచూపునూ – అది నీ నివాస స్థలముకు
నన్ను తోడుకొని వచ్చును – దేవా నా దేవా
|| నీ వెలుగు ||

2. అప్పుడు నీకు సితారతో – స్తుతి గీతము చెల్లింతును
ఓ … హోసన్నా … హోసన్నా – దేవా నా దేవా
|| నీ వెలుగు ||

3. ఏల క్రుంగిపోతివి – భీతిన్ విడు నా ప్రాణమా
ప్రీతిన్ ప్రభుని గనుమా – దేవా నా దేవా
|| నీ వెలుగు ||

నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు

పల్లవి : నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు
దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది

1. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది
దేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను
|| నీటి వాగుల ||

2. నీ దైవమేమాయెనని నిత్యము నాతో ననగా
రాత్రింబగళ్ళు కన్నీరే నా అన్న పానములాయె
|| నీటి వాగుల ||

3. ఉత్సాహ స్తుతులతో సమాజమును పండుగకు
దేవుని మందిరమునకు నడిపించితిని
|| నీటి వాగుల ||

4. ఇది తలంచగా నా ప్రాణము కరుగుచున్నది
నాదు ప్రాణమా యేల కృంగి తొందర పడుచున్నావు?
|| నీటి వాగుల ||

5. రక్షకుడగు దేవునిపైన నిరీక్షణ యుంచుము
ఆయన రక్షకుడని నేనింక స్తుతించెదను
|| నీటి వాగుల ||