యెహోవా నా దేవా నిత్యము

“యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి.” కీర్తన Psalm 30

పల్లవి : యెహోవా నా దేవా నిత్యము
నేను నిన్ను స్తుతియించెద
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ

1. యెహోవా నా శత్రువులను
నా పై సంతోషింప నీయక
నీవు నన్నుద్ధరించినందుకై నేను
నిన్ను కొనియాడుచున్నాను
|| యెహోవా ||

2. నేను నీకు మొరపెట్టగా
నీవు నన్ స్వస్థపరచితివి
పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి
భక్తులారా ప్రభున్ కీర్తించుడు
|| యెహోవా ||

3. యెహోవా పాతాళములో నుండి
నా ప్రాణము లేవదీసితివి
నేను సమాధిలోకి దిగకుండగ
నీవు నన్ను బ్రతికించితివి
|| యెహోవా ||

4. ఆయన కోపము నిమిషమే
దయ ఆయుష్కాలముండును
ఏడ్పు వచ్చి రాత్రియుండిన ఉదయ
మున సంతోషము కలుగును
|| యెహోవా ||

5. నే నెన్నడు కదలనని నా
క్షేమ కాలమున తలచితి
యెహోవా దయ కలిగి నీవే నా
పర్వతము స్థిరపరచితివి
|| యెహోవా ||

6. నీ ముఖము నీవు దాచిన
యపుడు నేను క్షోభిల్లితి
యెహోవా నీకే మొర పెట్టితిని
నా ప్రభువును బ్రతిమాలు కొంటిని
|| యెహోవా ||

7. నేను సమాధిలోకి దిగిన
నా ప్రాణము వలన లాభమా
మన్ను నిన్ను స్తుతించునా?
నీ సత్యమును గూర్చి అది వివరించునా?
|| యెహోవా ||

8. నా అంగలార్పును నీవేగా
నాట్యముగా మార్చియుంటివి
నా గోనెపట్ట విడిపించి సంతోష
వస్త్రము ధరింప జేసితివి
|| యెహోవా ||

ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా

“యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?” 

కీర్తన Psalm 27

పల్లవి : ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా
నే ధ్యానించి పాడెదన్
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు
పాడుట వినబడుచుండున్

1. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు
నేనెవరికి వెరతును?
యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయె
శత్రువులు తొట్రిల్లిరి విడువకుము
|| ఉదయ ||

2. యుద్ధము చేయుటకు దండు దిగినను
నా హృదయము భయపడదు
యుద్ధము రేగినను దీనియందు నే
ధైర్యము విడువకుందున్
|| ఉదయ ||

3.యెహోవా యొద్ద వర మొక్కటడిగితిని
దానిని వెదకు చున్నాను
యెహోవా ప్రసన్నత జూచి ఆలయమున
ధ్యానించుటయే నా ఆశ
|| ఉదయ ||

4. తన పర్ణశాలలో నను జేర్చి కాచును
నా ఆపత్కాలమునందు
తన గుడారములోన నను దాచియుంచును
దుర్గముపై నెక్కించున్
|| ఉదయ ||

5. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని
నీవు పల్కితివి గాన
నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదను
నీ సముఖమును దాచకు
|| ఉదయ ||

6. నా తల్లిదండ్రులు నన్ను విడచినను
యెహోవాయే చేరదీయున్
నే ధైర్యము కలిగి నిబ్బరముగ నుండెద
నీ కొరకు కనిపెట్టెదన్
|| ఉదయ ||

7. యెహోవా నాకై యుద్దేశించినది
ఆయనయే నెరవేర్చును
మహోన్నతుని మాటకు భయపడెడి పరిశుద్ధుల
కోరికలు నెరవేర్చును
|| ఉదయ ||