యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా

యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా
నీ యవ్వన రక్తము కార్చి – నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు
నిను వీడి జీవింప నా తరమా
నిను ఆరాధింప నా బలమా !
మది మందిరాన కొలువైన నా వరమా !!

1. నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని
నీ ఆజ్ఞలను విడిచి – నన్ను తిరుగనియ్యకుము
దైర్యమునిచ్చే – నీ వాక్యములో
నీ బలము పొంది – దుష్టుని ఎదిరింతును !! యేసయ్య !!

2. నా గురి గమ్యమైన నిను చేరిటకు
ఈ లోక నటనలు చూచి – నన్ను మురిసిపోనివ్వకు
పొందబోవు -బహుమానమునకై
నా సిలువను మోయుచు – నిను వెంబడించెదను !! యేసయ్య !!

3. నీ సంపూర్ణ సమర్పణయే – లోక కళ్యాణము
నీ శక్తి సంపన్నతలే – ఇల ముక్తిప్రసన్నతలు
మహనీయమైన – నీ పవిత్రతను
నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును !! యేసయ్య !!

నాలోన అణువణువున నీవని

నాలోన అణువణువున నీవని
నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని
యేసయ్యా నీ అపురూపమైన
ప్రతిరూపమునై ఆరాదించెదను

1. అరుణోదయ దర్శనమిచ్చి
ఆవేదనలు తొలగించితివి
అమృతజల్లులు కురిపించే – అనందగానాలు పాడుచునే
కలిగియుందునే – నీ దైవత్వమే !! నాలోన !!

2. ఇమ్మానుయేలుగా తొడైయుండి
ఇంపైన నైవెద్యముగ మర్చితివే
ఈ పరిచర్యలో నేను – వాగ్దానఫలములు పొందుకుని
ధరించుకుందునే – నీ దీనత్వమే !! నాలోన !!

3. వివేక హృదయము – అనుగ్రహించి
విజయపధములో నడిపించెదవు
వినయభయభక్తితో నేను – నిశ్చల రాజ్యము పొందుటకు
స్మరించుకుందునే – నీ ఆమరత్వమే !! నాలోన !!