రాజాధి రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక (2) విడువని కృప నాలో స్థాపించెనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) ||రాజాధి|| 1.వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2) కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2) ||రాజాధి|| 2.ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2) ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2) ||రాజాధి|| 3.మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2) నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే (2) ||రాజాధి||
సర్వయుగములలో సజీవుడవు
పల్లవి : సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన నీ సామర్ధ్యమును - కొనియాడబడినది నీ దివ్య తేజం - నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య (2) 1.ప్రేమతో ప్రాణమును అర్పించినావు - శ్రమల సంకెళ్ళయినా శత్రువును కరుణించువాడవు నీవే (2) శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు - జగతిని జయించిన జయశీలుడా (2) || సర్వయుగములలో || 2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు- శృంగ ధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవు (2) నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను - మరణము గెలిచినా బహు ధీరుడ (2) || సర్వయుగములలో || 3.కృపాలతో రాజ్యమును స్థిరపరచు నీవు - బహూత్తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2) నెమ్మది కలిగించే నీ బాహుబలముతో - శత్రువు నణచినా బహు శూరుడా (2) || సర్వయుగములలో ||