సర్వలోక నివాసులారా

    1. సర్వలోక నివాసులారా – సర్వాధికారిని కీర్తించెదము రారండి
    1. యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో
    1. మన సంతోషము – పరిపూర్ణము చేయు
    1. శాంతి సదనములో నివసింతుము
  1. కరుణా కటాక్షము పాప విమోచన
    
    యేసయ్యలోనే ఉన్నవి
    
    విలువైన రక్షణ అలంకారముతో
    
    దేదీప్యమానమై ప్రకాశించెదము|| సర్వలోక ||
  2. ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు
    
    మన దేవుని సన్నిధిలో ఉన్నవి
    
    పరిశుద్ధమైన అలంకారముతో
    
    కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము|| సర్వలోక ||
  3. సమృద్ధి జీవము సమైక్య సునాదము
    
    జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి
    
    మృదువైన అక్షయ అలంకారముతో
    
    సద్భక్తితో సాగిపోదము

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా
ఊహించలేనే నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే           ||ఆశ్రయ||

లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే
ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)        ||ఆశ్రయ||

నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)        ||ఆశ్రయ||

పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)        ||ఆశ్రయ||

నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2)
స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా (2)        ||ఆశ్రయ||