ప్రభువా నీ కలువరి త్యాగము

ప్రభువా నీ కలువరి త్యాగము – చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే”ప్రభువా”

1. నీ రక్షణయే ప్రాకారములని – ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి – 2
లోకములోనుండి ననువేరు చేసినది – నీదయా సంకల్పమే – 2 “ప్రభువా”

2. జీవపు వెలుగుగ నను మార్చుటకే – పరిశుద్ధాత్మను నాకొసగితివే – 2
శాశ్వత రాజ్యముకై నను నియమించినది – నీ అనాది సంకల్పమే – 2 “ప్రభువా”

3. సంపూర్ణునిగా నను మార్చుటకే – శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే – 2
పరిపూర్ణ శాంతితో నను కాచుటయే – నీ నిత్యసంకల్పమే – 2″ప్రభువా”

సర్వాధికారివి సర్వజ్ఞుడవు

సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు ||2||
దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప
మహిమాత్మతో నను నింపితివా ||2||


1. అతీసుందరుడా నా స్తుతి సదయుడ
కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా ||2||
ఎనలేనే నీ ఘనకార్యములు తలచి
స్తుతించుచు నిను నే మహిమపరతును ||2||   ||సర్వాధి||


2. బలశౌర్యములుగల నా యేసయ్యా
శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా
మారవే నీ సాహసకార్యములు యెన్నడు
ధైర్యముగా నిను వెంబడింతును ||2||   ||సర్వాధి||


3. సర్వజగద్రక్షకూడా – లోకరాజ్యపాలక
భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా ||2||
బలమైన నీ రాజ్యస్థాపనకై  నిలిచి
నిరీక్షణతో నే సాగిపోదును ||2||   ||సర్వాధి||