నీ కృప నిత్యముండును

నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2)        ||నీ కృప||

శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)        ||నీ కృప||

ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)        ||నీ కృప||

అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2)        ||నీ కృప||

సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై

పల్లవి: సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై
రానై యుండగా త్వరగా రానై యుండగా
సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము
సంఘసహవాసములో ప్రేమసామ్రాజ్యములో

1. వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను
ఏర్పరచబడినవారే తొట్రిల్లుచున్న కాలమిదే
వీరవిజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికే
విధేయులమై నిలిచియుందుము
|| సీయోను ||

2. అధైర్యపడకు వదంతులెన్నో విన్నాను
ఆత్మభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే
నిత్యమహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో
నిరంతరము ఆనందించెదము
|| సీయోను ||

3. ఆశ్చర్యపడకు ఆకాశశక్తులు కదలినను
దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యె కాలమిదే
ఆర్భాటముగా రారాజు యేసు దిగివచ్చే వేళ
రూపంతరము మనము పొందెదము
|| సీయోను ||