మహాఘనుడవు మహోన్నతుడవు

మహాఘనుడవు మహోన్నతుడవు

పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)

కృపా సత్య సంపూర్ణమై

మా మధ్యలో నివసించుట న్యాయమా

నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)

 

వినయముగల వారిని

తగిన సమయములో హెచ్చించువాడవని (2)

నీవు వాడు పాత్రనై నేనుండుటకై

నిలిచియుందును పవిత్రతతో (2)

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)        ||మహా||

 

దీన మనస్సు గలవారికే

సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2)

నీ సముఖములో సజీవ సాక్షినై

కాపాడుకొందును మెళకువతో (2)

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)       ||మహా||

 

శోధింపబడు వారికి

మార్గము చూపించి తప్పించువాడవని (2)

నా సిలువ మోయుచు నీ సిలువ నీడను

విశ్రమింతును అంతము వరకు (2)

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)       ||మహా||

 

 

 

వందనాలు వందనాలు

వందనాలు వందనాలు – వరాలు పంచే నీ గుణ సంపన్నతకు (2)

నీ త్యాగ శీలతకు నీ వశమైతి నే – అతి కాంక్షనీయుడా నా యేసయ్యా (2) ||వందన||

1. ఇహలోక ధననిధులన్నీ – శాశ్వతముకావని ఎరిగితిని (2)

ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకే – ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి ||వందన||

2. యజమానుడా నీవైపు – దాసుడనై నా కన్నులెత్తగా (2)

యాజక వస్త్రములతో ననుఅలంకరించి – నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే (2)  ||వందన||

3. ఆద్యంతములేని – అమరత్వమే నీ స్వంతము (2)

నీ వారసత్వపు హక్కులన్నియు – నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి (2) ||వందన||

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”