ఆనందమే పరమానందమే

ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము (2)       ||ఆనందమే||

పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే (2)
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే (2)       ||ఆనందమే||

గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను (2)
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే (2)       ||ఆనందమే||

నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు (2)
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము (2)       ||ఆనందమే||

నా ప్రాణమా నాలో నీవు – ఎందుకిలా కృంగియున్నావు ?

నా ప్రాణమా నాలో నీవు - ఎందుకిలా కృంగియున్నావు ? 
దేవునివలన ఎన్నోమేళ్ళను అనుభవించితివే 
స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా ? 

ఎందుకిలా జరిగిందనీ - యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని 
సహించి స్తుతించే - కృప నీకుంటే చాలునులే 

నా హృదయమా ఇంకెంత కాలము - ఇంతక నీవు కలవరపడుదువు 
దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే 
అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా ?             || ఎందుకిలా ||

నా అంతరంగమా నీలో నీవు - జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా 
దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా 
బ్రదుకు దినములన్నియు నీవు - ఉత్సాహగానము చేయుమా || ఎందుకిలా |