రాజ జగమెరిగిన నా యేసురాజా

రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన 
మన బంధము - అనుబంధము 
విడదీయగలరా - ఎవరైనను - మరి ఏదైనను ? 

దీన స్థితియందున - సంపన్న స్థితియందున 
నడచినను - ఎగిరినను - సంతృప్తి కలిగి యుందునే 
నిత్యము ఆరాధనకు - నా ఆధారమా 
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ || 

బలహీనతలయందున- అవమానములయందున 
పడినను - కృంగినను - నీ కృపకలిగి యుందునే 
నిత్యము ఆరాధనకు - నా ఆధారమా 
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||

సీయోను షాలేము - మన నిత్య నివాసము 
చేరుటయే నా ధ్యానము - ఈ ఆశ కలిగి యుందునే నిత్యము 
ఆరాధనకు - నా ఆధారమా 
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా – 2

  1. పగలు మేఘ స్థంభమై – రాత్రి అగ్ని స్థంభమై
    నా పితరులను ఆవరించి – ఆదరించిన మహానీయుడవు – 2
    పూజ్యనీయుడా నీతి సూర్యుడా
    నిత్యము నాకనుల మెదలుచున్న వాడా   “యేసయ్యా”
  2. ఆత్మీయ పోరాటాలలో – శత్రువు తంత్రాలన్నిటిలో
    మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా – 2
    విజయశీలుడా – పరిశుద్ధాత్ముడా
    నిత్యము నాలోనే నిలిచియున్నవాడా – 2   “యేసయ్యా”