కృపలను తలంచుచు

కృపలను తలంచుచు (2)
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్ (2)       ||కృపలను||

కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2)
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం – (యేసు) (2)      ||కృపలను||

రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2)
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2)       ||కృపలను||

సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2)
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను – (ఇలలో) (2)       ||కృపలను||

హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే (2)
సీయోను నివాసం నాకెంతో ఆనందం
ఆనందమానందమే – (ఆమెన్) (2)       ||కృపలను||

ఆరని ప్రేమ ఇది

ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2)
అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది
అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2)
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)       ||ఆరని||

సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2)
ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)       ||ఆరని||

నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి
క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది (2)
నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది (2)
ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది (2)       ||ఆరని||

భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు
చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన (2)
ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు (2)
ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది (2)       ||ఆరని||