సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా          ||సిలువలో||

నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ- మోయలేక మోసావు (2)
కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2)        ||వెలి||

వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2)        ||వెలి||

నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2)
నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2)
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2)        ||వెలి||

యెహోవాయే నా కాపరిగా

యెహోవాయే నా కాపరిగా
నాకేమి కొదువగును (2)

పచ్చికగల చోట్లలో
నన్నాయనే పరుండజేయును (2)
శాంతికరమైన జలములలో (2)
నన్నాయనే నడిపించును (2)          ||యెహోవాయే||

గాఢాంధకార లోయలలో
నడిచినా నేను భయపడను (2)
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2)
నా తోడైయుండి నడిపించును (2)          ||యెహోవాయే||

నా శత్రువుల ఎదుట నీవు
నా భోజనము సిద్ధపరచి (2)
నా తల నూనెతో నంటియుంటివి (2)
నా గిన్నె నిండి పొర్లుచున్నది (2)          ||యెహోవాయే||

నా బ్రతుకు దినములన్నియును
కృపాక్షేమాలు వెంట వచ్చును (2)
నీ మందిరములో నే చిరకాలము (2)
నివాసము చేయ నాశింతును (2)          ||యెహోవాయే||