యేసయ్యా నీ కృపా

యేసయ్యా నీ కృపా – నను అమరత్వానికి

అర్హునిగా మార్చెను – యేసయ్యా నీ కృపా

|| యేసయ్యా ||

 

1.నీ హస్తపు నీడకు పరుగెత్తగా – నీ శాశ్వత కృపతో నింపితివా

నీ సన్నిధిలో దీనుడనై – కాచుకొనెద నీ కృప ఎన్నడు

|| యేసయ్యా ||

 

2.నీ నిత్య మహిమకు పిలిచితివా – నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా

ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన – ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును

|| యేసయ్యా ||

 

3.గువ్వవలె నే నెరిగి నిను చేరనా – నీ కౌగిటనే నొదిగి హర్షించనా

ఈ కోరిక నాలో తీరునా ? – రాకడలోనే తీరును

|| యేసయ్యా ||

 ప్రేమామృతం నీ సన్నిధి

ప్రేమామృతం నీ సన్నిధి
నిత్యము నాపెన్నిధి ||2||

1. నీ కృప నన్నాదరించెనులే
భీకర తుపాను సుడిగాలిలో ||2||
కరములు చాచి ననుచేరదీసి
పరిశుద్ధుడా నీ బసచేర్చినావు ||2||  || ప్రేమామృతం ||

2. కమ్మని వెలుగై నీవున్నావులే
చిమ్మచీకటి కెరటాలతో ||2||
చీకటి తెరలు ఛేదించినావు
నీతి భాస్కరుడా నీవు నాకున్నావు ||2||  || ప్రేమామృతం ||