Sarvaanga Sundaraa

Sarvaanga Sundaraa Sadguna Shekharaa
Yesayyaa Ninnu Seeyonulo Choochedaa
Paravasinchi Paaduthu Paravallu Throkkedaa (2)

Naa Praarthana Aalakinchuvaadaa
Naa Kanneeru Thuduchuvaadaa (2)
Naa Shodhanalannitilo Immaanuyeluvai
Naaku Thodai Nilichithivaa (2)           ||Sarvaanga||

Naa Shaapamulu Baapinaavaa
Naa Aashraya Puramaithivaa (2)
Naa Nindalannitilo Yehoshapaathuvai
Naaku Nyaayamu Theerchithivaa (2)       ||Sarvaanga||

Naa Akkaralu Theerchinaavaa
Nee Rekkala Needaku Cherchinaavaa (2)
Naa Apajayaalannitilo Yehova Nissivai
Naaku Jaya Dhwajamaithivaa (2)       ||Sarvaanga||

సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2)

నా ప్రార్థన ఆలకించువాడా
నా కన్నీరు తుడుచువాడా (2)
నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా (2)           ||సర్వాంగ||

నా శాపములు బాపినావా
నా ఆశ్రయ పురమైతివా (2)
నా నిందలన్నిటిలో యెహోషాపాతువై
నాకు న్యాయము తీర్చితివా (2)         ||సర్వాంగ||

నా అక్కరలు తీర్చినావా
నీ రెక్కల నీడకు చేర్చినావా (2)
నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై
నాకు జయ ధ్వజమైతివా (2)          ||సర్వాంగ||

సన్నుతించెదను దయాళుడవు నీవని

Sannuthinchedanu Dayaaludavu Neevani - సన్నుతించెదను దయాళుడవు నీవని
సన్నుతించెదను - దయాళుడవు నీవని
యెహోవా నీవే దయాళుడవని నిను
సన్నుతించెదను ||2||
సన్నుతించెదను - దయాళుడవు నీవని

1. సర్వ సత్యములో నను నీవు నడిపి
ఆదరించిన పరిశుద్ధాత్ముడా ||2||
కృపాధారము నీవెగా షాలేమురాజా
నిను సన్మానించెదను ||2||     ॥సన్ను||

2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి
చూపితివా నీ వాత్సల్యమును ||2||
కృపానిధివి నీవెగా నా యేసురాజా
నిను సన్మానించెదను  ||2||     ॥సన్ను||

3.ఇహపరమందున నీకు సాటిలేరయా
ప్రగతిని కలిగించు రాజువు నీవయా ||2||
యూదా గోత్రపు సింహమా రాజాధి రాజా
నిను సన్మానించెధను.  ||2||     ॥సన్ను||