నీ ప్రేమే నను ఆదరించేను

నీ ప్రేమే నను ఆదరించేను -2

సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2

1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1

ఉదయించెను నీ కృప నా యెదలో – చెదరిన మనసే నూతనమాయెనా -2

మనుగడయే మరో మలుపు తిరిగేనా -2

నీ ప్రేమే నను ఆదరించేను -2

సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2

2. బలసూచకమైనా మందసమా నీకై -1

సజీవ యాగమై యుక్తమైన సేవకై – ఆత్మాభిషేకముతో నను నింపితివా -2

సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2

నీ ప్రేమే నను ఆదరించేను -2

సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
నీ కృపయే దాచి కాపాడెను…… -3

నీ కృప నాకు చాలును

Nee Krupa Naaku Chaalunu 

నీ కృప నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను ||2||
నీ కృప లేనిదే నే బ్రతుకలేను

జల రాసులన్ని ఏక రాసిగా
నిలిచిపోయెనే నీ జనుల ఎదుట ||2||
అవి భూకంపాలే అయినా
పెను తుఫానులే అయినా ||2||
నీ కృపయే శాశించునా
అవి అణగిపోవునా ||2|| ||నీ కృప||

జగదుద్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలచితివా ||2||
నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే ||2||
నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను ||2|| ||నీ కృప||