ఆనందింతు నీలో దేవా

ఆనందింతు నీలో దేవా
అనుదినం నిను స్తుతించుచు (2)
మధురమైన నీ నామమునే (2)
మరువక ధ్యానించెద ప్రభువా -ఆనందింతు

ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా (2)
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర (2) -ఆనందింతు

నాదు జనములు నను విడచినను
నన్ను నీవు విడువకుండా (2)
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన (2) -ఆనందింతు

శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న (2)
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము (2) -ఆనందింతు

శ్రమలు నన్ను చుట్టిన వేళ
చింతలో కృశించిన వేళ (2)
అభయముగా నీ దర్శనమిచ్చి
శ్రమలు బాపి శాంతినిచ్చితివి (2) ఆనందింతు

కృపా సత్య సంపూర్ణుడా

కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2 నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా …  మహనీయుడవు నీవేనయా … 

  1. ఎర్రసముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా 

    దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2     ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2 

  1. నూతనక్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా 

    నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2     నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2

  1. నైవేద్యములు, దహనబలులు నీ కోరవుగా 

    నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2     నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ  మారిపోయెనే -2