స్తుతి గానమా నా యేసయ్యా

Stuthi Gaanama Na yesayya | స్తుతి గానమా నా యేసయ్యా

స్తుతి గానమా - నా యేసయ్యా 
నీ త్యాగమే - నా ధ్యానము 
నీ కోసమే - నా శేష జీవితం          || స్తుతి ||

1.నా హీన స్థితి చూచి 
నా రక్షణ శృంగమై 
నా సన్నిధి నీ తోడని 
నను ధైర్యపరచినా … నా నజరేయుడా  || స్తుతి || 

2.నీ కృప పొందుటకు 
ఏ యోగ్యత లేకున్నను 
నీ నామ ఘనతకే 
నా శాశ్వత నీ కృపతో ...
నన్ను నింపితివా  || స్తుతి ||

అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు

పల్లవి:
అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు

యాకోబు దేవుడవు – నాకు చాలిన దేవుడవు

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)

1.
అబ్రహాము విశ్వాసముతొ – స్వ దేశము విడచెను

పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను (2X)

అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2X)

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)
…అబ్రహాము…

2.
ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను

వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను (2X)

ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)
…అబ్రహాము…

3.
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను

యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను (2X)

యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)