స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము

స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము
హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా

1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనా
నను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను |హల్లె | |స్తుతి |

2.యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలను
ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నే
జీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా |హల్లె | |స్తుతి |

శ్రీమంతుడా యేసయ్యా

Sreemanthudaa Yesayya – శ్రీమంతుడా యేసయ్యా

శ్రీమంతుడా యేసయ్యా
నా ఆత్మకు అభిషేకమా
నా అభినయ సంగీతమా  ||2||

1.సిలువధారి నా బలిపీఠమా
నీ రక్తపు కోట నాకు నివాసమా    ||2||
నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా    
ఇదియే నీ త్యాగ సంకేతమా    ||2||    || శ్రీమంతుడా ||

2.మహిమగల పరిచర్య పొందినందున
అధైర్యపడను కృప పొందినందున      ||2||
మహిమతో నీవు దిగి వచ్చువేళ
మార్పునొందెద నీ పోలికగా    ||2||  || శ్రీమంతుడా ||

3.సీయోను శిఖరము సింహాసనము
వరపుత్రులకే వారసత్వము    ||2||
వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా    ||2||  || శ్రీమంతుడా ||