ఆకాంక్షతో నేను కనిపెట్టుదును

Akankshatho Nenu Kanipettudunu |ఆకాంక్షతో నేను కనిపెట్టుదును

ఆకాంక్షతో - నేను కనిపెట్టుదును
ప్రాణేశ్వరుడైన - యేసుని కొరకై

పావురము - పక్షులన్నియును 
దుఃఖారావం - అనుదినం చేయునట్లు 
దేహవిమోచనము కొరకై నేను 
మూల్గుచున్నాను సదా               || ఆకాంక్ష ||

గువ్వలు - గూళ్ళకు ఎగయునట్లు 
శుద్ధులు తమ - గృహమును చేరుచుండగా 
నా దివ్య గృహమైన - సీయోనులో 
చేరుట నా ఆశయే                      || ఆకాంక్ష ||

ఆదరణ కర్తవు

ఆదరణ కర్తవు అనాధునిగా
ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు

అల్పుడనైయున్న నన్ను చేర దీసితివా
అనాది నీ ప్రేమయే నన్నెంతో బల పరిచెనే
ఆనంద భరితుడనై వేచి యుందును నీ రాకకై  “ఆదరణ”

నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు  “ఆదరణ”

యేసయ్య ! యేసయ్య !
యేసయ్య ! యేసయ్య !!