పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా

పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా
యేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయె

1. కలుషితమైన నదియై నేను కడలియ్యేనదిలో
కలసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాలరాశి

2. పోరు తరగని సిగసిగలెనియె అణచి కృపాతిశయము
పాదయైన నా హృదయంలోనే పొంగెనే అభిషేక తైలం

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే

పల్లవి: జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే-

నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే-

నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే-    (2X)…జ్యోతిర్మయుడా…

 

1.నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా    (2X)

నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా    (2X)

జ్యోతిర్మయుడా…

 

2.నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి    (2X)

నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా    (2X)

జ్యోతిర్మయుడా…

 

3.నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా    (2X)

త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద    (2X)

జ్యోతిర్మయుడా…