నా ప్రాణ ఆత్మ శరీరం – అంకితం నీకే ప్రభూ

నా ప్రాణ ఆత్మ శరీరం – అంకితం నీకే ప్రభూ
అంకితం నీకే ప్రభూ

1. పాపపు ఊబిలో మరణించిన నన్ను – పరమందు చేర్చుటకు

ప్రాణమిచ్చి నన్ను రక్షించినా – ప్రేమను మరువలేను

నీ కృపను మరువలేను ॥ నా ప్రాణ ॥

2. నన్ను నీ వలె మార్చుటకేగా – ఆత్మతో నింపితివి

ఆత్మతో సత్యముతో ఆరాధించి

ఆనంద ప్రవాహముతో నీదరి చేరెదను ॥ నా ప్రాణ ॥

నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా

నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా
నా యేసు రాజా రాజా – రాజా – రాజా…
రాజా రాజా యేసు రాజా
రాజా రాజా యేసు రాజా
రాజా యేసు రాజా (2)

నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము
నన్ను బంధించెనా (2)
నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2)      ||నా యేసు||

వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన
కనికర స్వరూపుడా (2)
నా కన్నీటిని నాట్యముగా మార్చితివా (2)      ||నా యేసు||

అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే
నా నీటి ఊట నీవే (2)
అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద (2)      ||నా యేసు||