స్తుతి సింహసనసినుడవు

స్తుతి సింహసనసినుడవు

స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
దయారసా యేసురాజా – దయారసా యేసురాజా
నీదు రూపును వర్ణించలేనయ్యా – నీదు రూపును వర్ణించలేనయ్యా – 2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా -2
నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో -2
నీ తోడు నే కోరితి -2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా  – 4

పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి -2
నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ -2
నీ సిలువ నే కోరితి -2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా  – 4

నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా

నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2)

నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)
నీ వాక్యమే నా పాదములకు దీపము (3)    ||నా స్తుతి పాత్రుడా||

నీ కృపయే నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)
నీ కృపయే నా జీవన ఆధారము (3)    ||నా స్తుతి పాత్రుడా||

నీ సౌందర్యము యెరూషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3)    ||నా స్తుతి పాత్రుడా||