పోరాటం ఆత్మీయ పోరాటం

పోరాటం ఆత్మీయ పోరాటం (2)
చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు
సాగిపోవుచున్నాను
సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2)

నా యేసుతో కలిసి పోరాడుచున్నాను
అపజయమే ఎరుగని జయశీలుడాయన (2)
నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

నా యేసు వెళ్ళిన మార్గము లేనని
అవమానములైనా ఆవేదనలైనా (2)
నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

ఆదియు అంతము లేనివాడు నా యేసు
ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)
ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

కృపానిధి నీవే ప్రభు

Krupaanidhi Neeve Prabhu – కృపానిధి నీవే ప్రభు

కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు ||2||
నీ కృపలో నన్ను నిలుపుము ||2||
నీ కృపతోనే నను నింపుము ||2|| ||కృపా||

1. నీ కృప ఎంతో మహోన్నతము
ఆకాశము కంటే ఎత్తైయినది ||2||
నీ సత్యం అత్యున్నతము
మేఘములంత ఎత్తున్నది ||2|| ||కృపా||

2. నీ కృప జీవముకంటే ఉత్తమము
నీ కృప లేనిదే బ్రతుకలెను ||2||
నీ కృపా బాహుళ్యమే నను
నీలో నివసింప చేసినది ||2||||కృపా||

3. నీ కృపలను నిత్యము తలచి
నీ సత్యములో జీవింతును ||2||
నీ కృపాతిశయములనే
నిత్యము నేను కీర్తింతును ||2|| ||కృపా||

4. ఈ లోకము ఆశాశ్వతము
నీదు కృపయే నిరంతరము ||2||
లోకమంతా దూషించినా
నీ కృప నాకంటే చాలు ||2|| ||కృపా||