మాధుర్యమే నా ప్రభుతో జీవితం

మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మహిమానందమే – మహా ఆశ్చర్యమే       ||మాధుర్యమే||

సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు
వారి అందమంతయు పువ్వు వలె
వాడిపోవును – వాడిపోవును       ||మాధుర్యమే||

నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే
దేవుని యందలి భయ భక్తులతో
ఉండుటే మేలు – ఉండుటే మేలు       ||మాధుర్యమే||

నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే
నా రోగమంతయు సిలువలో
పరిహరించెను – పరిహరించెను       ||మాధుర్యమే||

వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను
తేజోవాసులైన పరిశుద్ధులతో
ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో       ||మాధుర్యమే||

ప్రభువా నీలో జీవించుట

పల్లవి:
ప్రభువా నీలో జీవించుట
కృపా బాహుల్యమే
నా యెడ కృపా బాహుల్యమే ||ప్రభువా||

1. సంగీతములాయె
పెను తుఫానులన్నియు (2)
సమసిపోవునే నీ నామ స్మరణలో (2)
సంతసమొందె నా మది యెంతో (2) ||ప్రభువా||

2. పాప నియమమును
బహు దూరముగా చేసి (2)
పావన ఆత్మతో పరిపూర్ణమైన (2)
పాద పద్మము హత్తుకొనెదను (2) ||ప్రభువా||

3. నీలో దాగినది
కృప సర్వోన్నతముగా (2)
నీలో నిలిచి కృపలనుభవించి (2)
నీతోనే యుగయుగములు నిల్చెద (2) ||ప్రభువా||

4. నూతన వధువునై
శుద్ధ వస్త్రములు ధరించి (2)
నూతనమైన శుభాకాంక్షలతో (2)
నూతన షాలేమై సిద్దమౌదు నీకై (2) ||ప్రభువా||