శాశ్వత కృపను నేను తలంచగా

శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో (2)       ||శాశ్వత||

నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)
నా దేహమెంతో నీకై ఆశించే (2)       ||శాశ్వత||

దూతలు చేయని నీ దివ్య సేవను
ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)
ధూపార్తిని చేపట్టి చేసెద (2)       ||శాశ్వత||

భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)
వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2)       ||శాశ్వత||

సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)
సీయోను రారాజువు నీవేగా (2)       ||శాశ్వత||

నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే (2)
నూతన సృష్టిగా నన్ను మార్చెను (2)       ||శాశ్వత||

యేసు రాజు రాజుల రాజై

యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే – హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు||

యోర్దాను ఎదురైనా
ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
భయము లేదు జయము మనదే (2)
విజయ గీతము పాడెదము (2)      ||హోసన్నా||

శరీర రోగమైనా
అది ఆత్మీయ వ్యాధియైనా (2)
యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)
రక్తమే రక్షణ నిచ్చున్ (2)       ||హోసన్నా||

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)
యేసు రాజు మనకు ప్రభువై (2)
త్వరగా వచ్చుచుండె (2)       ||హోసన్నా||